Advertisement
ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. వాహనాలు బయటకు తీయాలి అంటేనే సాధారణ ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎటు వెళ్లినా బైక్ పై వెళ్లే ప్రజలు ప్రస్తుత కాలంలో అత్యవసరమైతే తప్ప బైక్ తీయడం లేదు. అదంతా పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం. ఇలాంటి వారికి శుభవార్త.. ఈ విధంగా బైకును గేర్ మార్చేటప్పుడు ఇవి పాటిస్తే మైలేజ్ ఇట్టే పెరుగుతుంది.. అదేంటో చూడండి..?
Advertisement
బైక్ మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలంటే ముఖ్యంగా టైర్లలో గాలిఎప్పుడూ తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి.ఈ విధంగా టైర్లలో సరిపడా గాలి ఉన్నప్పుడే ఇంజన్ మీద భారం పడదు. మరో విషయం ఏంటంటే ట్యాంకులో సరిపడా పెట్రోల్ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం వచ్చే బి ఎస్ సిక్స్ వాహనాలకు ఈ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా పాత వెహికిల్ అయితే పెట్రోల్ పూర్తిగా అయిపోయేవరకు నడిపితే సమస్యలు ఎదురవుతాయి. ఈ విధంగా చేస్తే ట్యాంక్ లో ఉండే చెత్త అంతా కార్పేటర్ వద్ద చేరి ఇంజన్ లైఫ్ తగ్గుతుంది.
Advertisement
అలాగే రెగ్యులర్ గా ఇంజన్ ఆయిల్ మార్చటం అనేది మర్చిపోవద్దు. కనీసం నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ఇంజన్ ఆయిల్ మార్చడం ఉత్తమం. అలాగే మనం కొట్టించే పెట్రోల్ కూడా కల్తీ ఉంటే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఒకేసారి స్పీడ్ గా గేర్లు వేస్తూ ఉంటారు. ఆ విధంగా వేయకుండా కొంత దూరం వెళ్ళాక దాని వేగాన్ని బట్టి గేర్లు మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల బైక్ మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది.
ALSO READ;
తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించిన.. 6 సినిమాలు ఏంటంటే..?