Advertisement
తాజాగా ఓ కిలాడీ ముఠా బంగారు దుకాణాలను టార్గెట్ చేస్తూ వరుసగా మోసాలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముందుగా వీరు బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చే కస్టమర్ల మాదిరిగా దుకాణంలోకి ప్రవేశిస్తారు. క్షణికావేశంలో సిబ్బంది, యజమాని దుకాణంలో పరిస్థితిని అర్ధం చేసుకుంటారు. దుకాణానికి వచ్చే సాధారణ సందర్శకుల మాదిరిగానే సిబ్బందితో మాట్లాడి వారికి నమ్మకం కలిగే విధంగా ప్రవర్తిస్తారు.
Advertisement
వీటిని ఒక లుక్ వెయ్యండి: అతిలోక సుందరి తన డైట్ లో చేసిన ఆ ఒక్క తప్పే తన ప్రాణాన్ని బలి తీసుకుందా ?
తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను ఇచ్చేసి వాటి విలువకు తగ్గ కొత్త ఆభరణాలను పొందుతారని చెబుతున్నారు. షాప్ వారికి మొదట పరీక్ష కోసం అసలు బంగారు ఆభరణాలను ఇస్తుంది. బరువు, పరీక్ష మరియు ధరల గురించిన చర్చ తరువాత వీరి నాటకానికి తెర లేపుతారు.
వీరు షాపులోకి వచ్చే సమయంలో అసలు ఆభరణాలతో పాటు నకిలీ నగలు కూడా తెచ్చుకుంటారు. తాము కొనుగోలు చేసిన పాత బంగారు ఆభరణాలను పరీక్షించిన అనంతరం తమ పాత బంగారం ధరను పెంచేందుకు బేరం కుదుర్చుకుని, చివరకు తాము ఇచ్చే పాత బంగారానికి ఎక్కువ రేటు ఇవ్వకుంటే పాత బంగారం ఇవ్వలేమని చెప్పి ఇచ్చిన నగలను వెనక్కి తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటారు.
Advertisement
వీటిని ఒక లుక్ వెయ్యండి: శ్రీలీల నందమూరి ఇంటి కోడలు కాబోతోందా? వైరల్ అవుతున్న ఫోటో..!
ఈలోగా మనసు మార్చుకోవడమో.. లేదా దుకాణదారుడిని మరో రేటుకి ఒప్పించడమే చేసి.. బాగ్ లో పెట్టుకున్న నకిలీ బంగారాన్ని తీసి ఇస్తారు. నకిలీ వాటిని ఇచ్చి.. అదే రేటుకి మరో బంగారాన్ని కొనుగోలు చేసి మెల్లగా షాప్ నుంచి వెళ్ళిపోతారు.
జిల్లాలోని శ్రీకాకుళం, పలాస కాశీబుగ్గ, నరసన్నపేటలో ఇలాంటి మోసాలు జరిగాయి. గతనెల 27న శ్రీకాకుళంలోని ఎస్ఎస్ జ్యూయలర్స్లో 45 గ్రాములు, 28న పలాస కాశీబుగ్గలోని నగల దుకాణంలో 58 గ్రాములు, సెప్టెంబర్ 29న నరసన్నపేటలోని నగల దుకాణంలో 73 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
10 లక్షల రూపాయలకు పైగా విలువైన 176 గ్రాముల బంగారం చోరీకి గురైంది. కానీ ఎస్ఎస్ జ్యువెలర్స్ యజమాని ఈ కిలాడీ లేడీస్ ఇచ్చిన బంగారాన్ని కరిగించగా 80 శాతానికి పైగా రాగి బయటకు వచ్చింది. దీంతో షాక్ తిన్న షాపు యజమాని సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఈ సిసి టీవీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
వీటిని ఒక లుక్ వెయ్యండి: పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకు పడ్డ సీఎం జగన్.. వ్యాపారి అంటూ..?