Advertisement
Razakars: తాజాగా రజాకార్ సినిమా టీజర్ ఒకటి విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ పై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఈ సినిమాను బాన్ చెయ్యాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా ఏ కాన్సెప్ట్ పై రూపొందింది? రజాకార్లు అంటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ సంస్థానంలో గతంలో రజాకార్లు చేసిన దారుణాలను చూపిస్తూనే ఈ సినిమా తీసారట. నిజం సైన్యం తెలంగాణ గడ్డపై మారణ హోమం చేసారు. దేశానికీ 1947 లోనే స్వతంత్రం వచ్చినా.. తెలంగాణకు మాత్రం రాలేదు.
Advertisement
80 , 90 ఏళ్ల వయసు వున్నా వారికి అప్పట్లో రజాకార్లు చేసిన దారుణాలు గురించి గుర్తుండే ఉంటుంది. ఈ దారుణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ రూపొందిన సినిమా రజాకార్. ఈ సినిమా టీజర్ గత నెలలో విడుదల అయ్యింది. ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో విడుదల అయిన ఈ సినిమా టీజర్ కొత్త రచ్చకి తెరలేపుతోంది అంటూ రాజకీయ నాయకులూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తున్నారు. బిజెపి నేత గూడూరు నారాయణరెడ్డి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
Advertisement
అయితే ఈ సినిమాను బాన్ చేయాలంటూ పలువురు రాజకీయ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న రజాకార్లు హిందువులను ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నాలు చేసేవారు. వారు ముస్లిం రాజ్యంగా మార్చాలని, తమ హవాని కొనసాగించాలని ప్రయత్నాలు చేసారు. అయితే ఎలక్షన్ల సమయంలో ఈ టీజర్ రిలీజ్ చేయడంపై కేటీఆర్ స్పందించారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణాలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. గతంలో జరిగిన సంఘటనలను చూపి రజాకార్ల పేరుతొ ముస్లింలను చెడ్డగా చూపించి, రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.
“రంగస్థలం” సినిమాలో చిట్టిబాబు ఈ పని చేసి ఉంటె బాగుండేది ఏమో కదా..?
గుడికి వెళ్లేముందు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకోకూడదు?
Spandana APస్పందన యాప్ అంటే ఏమిటి? దీని వలన ప్రజలకు కలిగే లాభాలు ఏమిటి?