Advertisement
రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. మొదట్లో ఓ సామాన్య రైతుగానే ఉన్న పల్లవి ప్రశాంత్ వీడియోస్, రీల్స్ ద్వారా రైతు బిడ్డగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడం తన డ్రీం అంటూ ప్రశాంత్ చాలా సార్లు చెప్పాడు. అయితే.. బిగ్ బాస్ సెలక్షన్స్ కి ముందు కూడా తనను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి అంటూ చాలా వీడియోస్ లో కోరాడు.
Advertisement
అతని ఫాలోయింగ్ పుణ్యమా అని.. అతనికి త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ వచ్చేసింది. అయితే.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండే అవకాశం లేదులే అని చాలా మంది అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే అతను హౌస్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కువగా అమ్మాయిలతోనే మాట్లాడుతుండడం. అయితే.. నాగార్జున ఒకసారి పల్లవి ప్రశాంత్ ను హెచ్చరించారు. ప్రవర్తన గురించి మార్పులు చేసుకోవాలని సూచనా చేసారు.
Advertisement
అప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ తన ఆటలో చాలా తేడా చూపిస్తూ వచ్చారు. బిగ్ బాస్ మొదలైన తొలి రోజుల్లో ఉన్నప్పటి ప్రశాంత్ కు ఇప్పటి ప్రశాంత్ కు చాలా తేడానే ఉంది. తన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్న ప్రశాంత్ సీజన్ లో మొదటగా కెప్టెన్ అయ్యి అందరిని షాక్ కి గురి చేసాడు. అయితే.. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి పల్లవి ప్రశాంత్ కు పెళ్లి అయ్యిందన్న సంగతే ఎవరికీ తెలియదు. ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండడంతో పల్లవి ప్రశాంత్ కు పెళ్లి అయ్యిందా? అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ సన్నిహితులు కానీ, పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫొటోలో కనిపించిన అమ్మాయి కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
మరిన్ని..
Renudesai: రేణుదేశాయ్ లైఫ్ పెళ్ళికి ముందు కూడా దారుణమేనా? పేరెంట్స్ మరీ ఇలా ఉన్నారా?