Advertisement
Ayudha Pooja 2023: ప్రతి ఏడాది శరన్నవరాత్రులలో ఆఖరి రోజును విజయ దశమిగా పేర్కొంటారు. ఆరోజున ఆయుధ పూజ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆయుధాలను ప్రత్యేకంగా పూజించడానికి ఓ కారణం కూడా ఉంది. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు కూడా ఈరోజునే తమ ఆయుధాలను పూజించి యుద్ధానికి వెళ్లి విజయం సాధించారన్న కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచే ఈరోజున ఆయుధాలను, పనిముట్లను పూజిస్తే విజయం లభిస్తుంది అని తెలుస్తోంది. అందుకే దసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించి.. ఆ తరువాత తొమ్మిదవ రోజున ఆయుధ పూజ కూడా చేస్తూ ఉంటారు.
Advertisement
Also Read: Happy Dussehra 2023 : Wishes, Greetings, Images, Quotes, Whatsapp Status in Telugu
Advertisement
అయితే.. ఈ ఆయుధ పూజ చెయ్యడానికి ప్రత్యేకమైన ముహూర్తం ఉంది. హిందూ క్యాలెండర్ ను అనుసరించి ఆశ్వీయుజ శుక్ల పక్ష తొమ్మిదవ రోజున విజయదశమి వస్తుంది. ఈరోజునే ఆయుధ పూజ చేసుకుంటారు. అయితే 2023 వ సంవత్సరంలో అక్టోబర్ 23 వ తేదికి విజయ దశమి వచ్చింది. ఈరోజున తప్పకుండ ఆయుధ పూజ చేసుకుని మీ జీవితంలో అనేక విజయాలను సాధించండి. అయితే.. ఆయుధ పూజను ఏ సమయంలో చేసుకోవాలి?
ఈ ఏడాది నవమి తిధి 22 అక్టోబర్ 2023, 07:58 సాయంత్రం ప్రారంభం అవుతుంది. 23 అక్టోబర్ 2023, 05:44 సాయంత్రం వరకు ఈ తిధి కొనసాగి తరువాత దశమి వస్తుంది. దీనిని బట్టి 23 అక్టోబర్ 2023, 01.58 – 04.43 గం మధ్యాహ్నం సమయంలో ఆయుధ పూజ చేసుకోవడానికి ముహూర్తం బాగుంది. ఈరోజున క్షత్రియులు వారి ఆయుధాలను, కళాకారులూ వారి పనికి సంబంధించిన వాయిద్యాలను, పని వారు వారి పనిముట్లను పూజిస్తారు. దక్షిణ భారత దేశంలో కొందరు ఈరోజున సరస్వతి పూజను కూడా చేసుకుంటారు.