Advertisement
ఓ సినిమా సక్సెస్ అయ్యింది అంటే.. దాని వెనుక కీ రోల్ ఆ సినిమా దర్శకుడిది. అతని కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. హీరోల కష్టం కూడా ఉంటుంది. కానీ, హీరోల చేత స్క్రిప్ట్ ప్రకారం నడిపించిన కష్టం మాత్రం దర్శకుడిదే. ఎన్నో విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓ సినిమా తీస్తాడు దర్శకుడు. కానీ.. ఇండస్ట్రీలో కొందరు హీరోలు తాము నటించడం వల్లే సినిమా హిట్ అవుతోంది అన్న భ్రమలో ఉంటారు. రాజమౌళికి కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైంది.
Advertisement
అందుకే ఓ స్టార్ హీరోకి సినిమా తీయాలంటే స్టార్ హీరోనే ఉండాల్సిన అవసరం లేదు.. ఈగని పెట్టి కూడా సినిమా తీయచ్చు అని చెప్పడానికే ” ఈగ” సినిమా తీసాడట. ఈ వార్తా ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే.. ఇలాంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్ ని నమ్మి, చెప్పినట్లు నటించే హీరోలు ఉండాలి. హీరో ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనుకునే మైండ్ సెట్ ఉండే వాళ్లతో ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యం కాదు. డైరెక్టర్ ఎవరైనా, హీరో ఎవరైనా.. ముందు కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది.
Advertisement
ఇండస్ట్రీలో చాలా మంది ఫ్లాప్ లను చవిచూసిన వారే. ఇప్పుడు కాన్సెప్ట్ ను బేస్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టే విజయాలు వారి సొంతం అవుతున్నాయి. మొత్తానికి రాజమౌళి ఈగతో కూడా సినిమా తీసేసి యాభై కోట్లకి పైగా కలెక్షన్ ని రాబట్టేసాడు. కంటెంట్ ఉన్నోడికి అవతల ఎవరు ఉన్న అవసరం లేదు అని నిరూపించాడు. ఇక నాని కూడా కథలో పాత్రకి తగ్గట్లు ఇమిడిపోయాడు. ఈ సినిమా నానికి కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.
మరిన్ని..
Raviteja Tiger Nageswara Rao Movie Dialogues, టైగర్ నాగేశ్వర రావు మూవీ డైలాగ్స్