Advertisement
ప్రతి హీరోకు డెబ్యూ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ హీరో అయినా తన టాలెంట్ ని డెబ్యూ మూవీ లోనే చూపించి ప్రేక్షకుల మదిలో మంచి ప్లేస్ కొట్టేయాలని అనుకుంటాడు. అందుకే డెబ్యూ మూవీ ఏ హీరోకి అయినా ఇంపార్టెంట్. అయితే.. మన టాలీవుడ్ స్టార్ హీరోలకు కొన్ని డెబ్యూ మూవీస్ మిస్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
#1 అఖిల్ :
నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా “అఖిల్”. ఈ సినిమా ఆశించినంతగా ఫలితం రాబట్టలేదు. అఖిల్ మొదటిసారిగా మనం సినిమా క్లైమాక్స్‌లో తెరపై కనిపించిన సంగతి తెలిసిందే. ఆ టైములో ఆ సినిమా దర్శకుడు ఓ లవ్ స్టోరీ చెప్పాడట. కానీ, అఖిల్ యాక్షన్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఆ స్టోరీని పక్కన పెట్టాడట. ఆ స్టోరీని తరువాత “హలొ” సినిమాగా తీశారు. అలా “హలో” సినిమా డెబ్యూ సినిమా అవ్వాల్సింది కాస్త మిస్ అయ్యింది.
#2 వరుణ్ తేజ్:
వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా కంటే ముందు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో “హార్ట్ ఎటాక్” సినిమాలో ఆఫర్ వచ్చిందట. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.
#3 నాగచైతన్య :
నాగచైతన్యకు కూడా చూడగానే లవర్ బాయ్ అనిపించే ఇమేజ్ ఉంది. అందుకే నాగచైతన్యకి కూడా మొదటగా కొత్త బంగారు లోకం సినిమాలో అవకాశం వచ్చిందట. కానీ, యాక్షన్ మూవీ లో నటించాలని అనుకోవడంతో జోష్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
#4 అడవిశేష్ :
అడవిశేష్ సొంతం మూవీ లో గెస్ట్ అప్పీరెన్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే.. లీడ్ రోల్ లో మాత్రం 2010 లో వచ్చిన కర్మ అనే సినిమాలో నటించాడు. కానీ మొదటగా అడివిశేష్ కు చందమామ సినిమాలో కాజల్ కు జోడిగా అవకాశం వచ్చిందట. కానీ ఆ రోల్ ను తరువాత నవదీప్ తో రీప్లేస్ చేశారట.
Advertisement
#5 అల్లు అర్జున్ :
అల్లు అర్జున్ ని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మంచి లవ్ స్టోరీతో ఇంట్రడ్యూస్ చేయాలనీ అనుకున్నారట. అనుకున్నట్లే తడవుగా తేజ ఓ స్టోరీ చెప్పాడట. అదే “జయం” స్టోరీ. అందరు ఒకే చేశారు. కానీ, ఎందుకో తేజకి ఈ రోల్ కి అల్లు అర్జున్ సూట్ అవ్వడు అనిపించిందట. అందుకే ఆ సినిమా కాకుండా ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు.
#6 రామ్ చరణ్:
రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. కానీ, రామ్ చరణ్ ను మెగాస్టార్ రాజమౌళి డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేయాలనీ అనుకున్నారట. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ గురించి ఏమీ తెలియకుండా వద్దు. ఒక సినిమా చూసిన తరువాత తీస్తాను అని చెప్పి. చిరుత సినిమా తరువాత మగధీర తీసాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.
#7 మహేష్ బాబు:
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం రాజకుమారుడు. అయితే ఈ సినిమా కంటే ముందే “యమలీల” స్టోరీ రాసుకున్నారట. కానీ ఎందుకు ఈ సినిమాను మహేష్ బాబుతో తీయడం కుదరలేదు. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజలు నటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని..
Raviteja Tiger Nageswara Rao Movie Dialogues, టైగర్ నాగేశ్వర రావు మూవీ డైలాగ్స్