Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ స్టార్ గా మహేష్ బాబు పేరు సంపాదించుకున్నారు. ఆయన తండ్రి కూడా సూపర్ స్టార్ కృష్ణగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తండ్రి వారసత్వాన్ని మహేష్ బాబు పుణికి పుచ్చుకున్నారు. కేవలం ఆయన ఆస్తులు, బ్యాక్ గ్రౌండ్ లోనే కాదు నటన ప్రతిభలోను, సంస్కారం కూడా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు మహేష్ బాబు. తండ్రి అడుగు జాడల్లో నడిచి ఎన్నో హిట్ సినిమాలను మహేష్ సొంతం చేసుకున్నారు.
Advertisement
మహేష్ కు రమేష్ బాబు అనే ఒక అన్నయ్య కూడా ఉన్నారు. రమేష్ కూడా హీరోగా చెయ్యాలని ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీనితో ఆయన సినిమాలకు స్వస్తి చెప్పాడు. గతేడాది దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించాడు. ఇటీవల మహేష్ బాబు నమ్రత తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అక్కడ తన కెరీర్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. సినిమా హీరో అవ్వడం అందరు ఈజీ అని అనుకుంటారు. కానీ ఇది చాల కష్టమైనది అని చెప్పుకొచ్చారు.
Advertisement
విజయం వచ్చినప్పుడు ఎలా ఆనందపడతామో.. ఏదైనా సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా అంతకుమించి బాధ, విసుగు, కోపం, చిరాకు ఫీలింగ్స్ వస్తాయని చెప్పుకొచ్చారు. వీటిని అదుపులో ఉంచుకోవడం కష్టమేనని అన్నారు. కానీ, తనకు తన తండ్రి అన్ని విషయాలు నేర్పించారని.. విజయం అయినా అపజయం అయినా సమానంగా ఎలా తీసుకోవాలో తన తండ్రి నేర్పించారని అన్నారు. విజయం సాధించినప్పుడు సినిమా టీం కి క్రెడిట్ ఇవ్వాలని.. కృతజ్ఞతగా ఉండాలని తెలిపాడు. పరాజయం వస్తే.. అందులో మన తప్పులకు బాధ్యత వహించాలని చెప్పాడన్నారు. ఆస్తులతో పాటు.. ఈ సంస్కారం, విలువలని కూడా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుకి ఇచ్చారు అంటూ నెటిజన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
మరిన్ని..
ఆ సినిమాలో శ్రీదేవి కి ఆర్టిస్ట్ హేమ డూప్ గా నటించారని తెలుసా? ఏ సినిమాలో అంటే..
బషీర్బాగ్..బేగంపేట్..అబిడ్స్.. ఈ ప్లేస్ లకు ఈ పేర్లు ఎలా పెట్టారో తెలుసా?
Leo Movie: మా సినిమాని మాకే వదిలావా అంటూ “లియో” సినిమా డైరెక్టర్ లోకేష్ ని ఆడుకుంటున్న నెటిజన్స్..!