Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా… చంద్రబాబు నాయుడు కటకటాల వెనక్కి వెళ్లారు. దాదాపు 50 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆయన బెయిల్ కోసం టిడిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు.
Advertisement
ఇవి కూడా చదవండి: సిబిఎన్ కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఏమి తీర్పు చెప్పబోతోంది?
ఇక ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అలాగే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. స్కిన్ డెవలప్మెంట్ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను నవంబర్ ఒకటో తేదీ వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు. గతంలో చంద్రబాబు నాయుడు పై విధించిన రిమాండ్ తేదీ ఇవాల్టితో ముగిసింది. అయితే దీనిపై ఏసీబీ కీలక నిర్ణయం తీసుకొని… చంద్రబాబు నాయుడు రిమైండర్ను నవంబర్ ఒకటో తేదీ వరకు పొడిగించింది. అంటే చంద్రబాబు మరో 15 రోజుల పాటు జైలు జీవితాన్ని గడపనున్నాడు.
Advertisement
ఇవి కూడా చదవండి: సుప్రీం తీర్పు ఎలా ఉన్నా జనంలోకి రానున్న టీడీపీ.. పక్క ప్లాన్ సిద్ధం..?
ఇక కోర్టు తీర్పుతో… టిడిపి పార్టీలో ఉన్న నేతలు అలాగే కార్యకర్తలకు తీవ్ర నిరాశ ఎదురయింది. దీంతో పార్టీపై పూర్తిగా విశ్వశాన్ని కోల్పోతున్నారు కార్యకర్తలు. ఎంత ప్రయత్నించినప్పటికీ చంద్రబాబుకు బెయిల్ రావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను నారా లోకేష్ కలిసినప్పటికీ…. చంద్రబాబు బెయిల్ రాలేదు. అలాగే జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకు క్షీనిస్తోంది. ఈ అన్ని పరిస్థితులు అర్థం చేసుకున్న టిడిపి కార్యకర్తలు… మనోవేదన చెందుతున్నారు. అసలు ఏపీలో టిడిపి పార్టీ ఇలాగే కొనసాగితే… చాలా కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టిడిపి కార్యకర్తలు. ఇలాంటి నేపథ్యంలో నారా భువనేశ్వరి… జనాల్లో ఎక్కువగా ఉండి కార్యకర్తలలో… జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు బయటికి వస్తే తప్ప టిడిపి గాడిలో పడే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.