Advertisement
శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఈ సినిమాను మర్చిపోవడం అంటూ జరగదు. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా, సదా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో హీరోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు చూపిస్తారు. ఒరిజినల్ క్యారెక్టర్ అమాయకంగా ఉండే రామం అయితే.. అన్యాయం జరిగినప్పుడు బయటకి వచ్చే అపరిచితుడు, సదా ప్రేమ కోసం లవర్ బాయ్ గా కనిపించే రెమో.. మరో రెండు క్యారెక్టర్లు చూపిస్తారు.
Advertisement
ఈ సినిమా క్లైమాక్స్ లో విక్రమ్ సదా తో కలిసి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అక్కడ కొందరు మందు తాగుతూ ఉంటారు. అయితే.. వారిని చూసి అపరిచితుడు మళ్ళీ వస్తాడేమో అని సదా భయపడుతుంది. కానీ, హీరో వారినుంచి పక్కకి తప్పుకుని మరో చోట కూర్చుని సదా ముందు అడ్జస్ట్ అయినట్లు నటిస్తాడు. కానీ తరువాత సైలెంట్ గా ఆ మందు తాగేవాడిని ట్రైన్ బయటకు తోసేసి లేపేస్తాడు. ఇక్కడ రామ్ లో అపరిచితుడు వచ్చి ఈ పని చేసినట్లు ఎండింగ్ లో అనిపిస్తుంది. కానీ, అసలు అర్ధం వేరే ఉంది.
Advertisement
హీరో రామ్ చెల్లెలు చనిపోవడానికి కారణం అయిన వ్యక్తుల్లో ఒకడు ఆ మందు తాగే గ్యాంగ్ లో ఉంటాడు. అతను గాంధీ జయంతి రోజు కూడా బ్లాక్ లో మందు కొనుక్కుని తాగి.. హీరో తండ్రి ఫోన్ చేసినప్పుడు నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. అతను హీరో తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని ఆ నీళ్ళల్లో పడిన కరెంట్ వైర్ ని తొలగించి తన పని సరిగ్గా చేసి ఉంటె.. హీరో చెల్లెలు బతికి ఉండేది. అతను తప్ప తాగి నిర్లక్ష్యంగా ఉండడమే హీరో చెల్లెలి మరణానికి పరోక్షంగా కారణమైంది. అయితే.. అపరిచితుడు లాంటి వ్యక్తి తన పర్సనల్ కారణంగా అతన్ని చంపినట్లు చూపించకుండా.. రైల్లో మందు తాగడం లాంటి తప్పుడు పని చేసినందుకే శిక్ష అనుభవిస్తున్నాడు అని అర్ధం వచ్చేలా శంకర్ క్లైమాక్స్ ని రూపుదిద్దారు. ఎంతైనా డైరెక్టర్ శంకర్ ది క్రేజీ మైండ్ కదా.
మరిన్ని..
Tiger Nageswara Rao Movie Review in Telugu: టైగర్ నాగేశ్వరరావు కథ, రివ్యూ & రేటింగ్ !