Advertisement
ప్రపంచ దేశాలన్నిటి కంటే భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఎక్కడా లేని ఆచారాలు సంప్రదాయాలు మన దేశంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ దేశంలో అనేక కుగ్రామాలు ఉన్నాయి. వివిధ జాతుల వారు, తెగల వారు ఈ గ్రామాలలో నివసిస్తూ ఉంటారు. వీరి సంప్రదాయాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని కొన్ని సంప్రదాయాల గురించి చెప్పుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటిదే ఈ సంప్రదాయం కూడా.
Advertisement
ఆ గ్రామంలో మహిళలు ఐదు రోజుల పాటు ఒంటి మీద ఎలాంటి దుస్తులు వేసుకోకుండానే ఉంటారట. అయితే.. ఇది ఆధ్యాత్మికతకు చిహ్నమట. హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న పిని అనే గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. వారు తమ దేవతను ఇలా దుస్తులు లేకుండా ఐదు రోజుల పాటు పూజిస్తారట. పంచ భూతాల సాక్షిగా సూర్యుని కాంతి, స్వచ్ఛమైన గాలి, నీరు తమ వంటిని తాకేందుకే వారు ఈ ఆచారాన్ని పాటిస్తారట. ఈ ఐదు రోజులు పూర్తి అయ్యిన తరువాత వారు తమని తాము సుద్ధి పరుచుకున్నట్లు భావిస్తారట.
Advertisement
సహజ వాయువులు ఒంటిని తాకితే తమకు క్షేమం అని నమ్ముతారట. తమని, తమ గ్రామాన్ని క్షేమంగా చూడాలని వారు తమ దేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటారట. ఇలా కోరుకున్నాక తమ ఒంటిపై దుస్తులను తీసివేసి గ్రామ దేవతని పూజిస్తారట. ఈ ఆచారాన్ని చూసి ప్రపంచ దేశాల ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. కానీ వారు మాత్రం ఇదంతా తమ ఆధ్యాత్మికతలో ఓ భాగమే అని చెబుతున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వింత ఆచారాన్ని గురించి తెలుసుకుని నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని..
ఈ కారణాలకి కూడా విడాకులు తీసుకుంటున్నారా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన లాయర్!
పొన్నాలపై ప్రేమ కురిపించడం వెనుక బిఆర్ఎస్ భారీ స్కెచ్చే వేసిందిగా..!