Advertisement
రేణుదేశాయ్ పేరు వినగానే ముందు మైండ్ లోకి వచ్చే విషయం పవన్ కళ్యాణ్ తో విడాకుల అంశమే. వీరిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్నా.. రేణు దేశాయ్ ఒంటరిగానే పిల్లలను పెంచుకుంటూ వస్తున్నా.. ఈ టాపిక్ గురించిన డిస్కషన్ మాత్రం ఆగదు.
Advertisement
అయితే.. ఇది ఆమెకు ఎంత బాధాకరమో చెప్పక్కర్లేదు. ఆమె రెండవ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఓ వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఎంగేజ్మెంట్ కు కూడా సిద్ధం అయ్యారు. అయితే.. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో చాలా మందికి తెలియదు.
ఓ సారి ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ నే ఈ విషయాన్నీ స్వయంగా తెలిపారు. అప్పటికి రేణు దేశాయ్ కూతురు ఆద్య వయసు 13 సంవత్సరాల వయసు మాత్రమేనని.. ఆమెకి తల్లిగా తన అవసరం ఉంటుందని, .
Advertisement
నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే నా సమయాన్ని ఆమెకు కేటాయించడం చాలా కష్టమని భావించానని, కూతురుని వదిలి వెళ్ళలేనని, అందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. కానీ పెళ్లి అన్న బంధంపై తనకు చాల గౌరవం ఉందని, అది బలమైనది అని భావిస్తానని, తన కూతురు కొంచం పెద్ద అయ్యాక రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆమె అభిమానులకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి.
ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆద్య వయసు ఏడు సంవత్సరాలు అని గుర్తుకురాలేదా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తాను కాలేజీకి వెళ్లే వయసు వచ్చాక అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అప్పుడు మాత్రం తాను ఎక్కడ ఉంటుంది? అసలు వదిలేసి వెళ్లాలని అనుకోవడం మాత్రం ఎందుకు? మీ జీవితంలోకి వచ్చే వారు మీ పిల్లల గురించి ఆలోచించరా? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
రెండవ పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి మహిళకు ఎదురయ్యే మొదటి సమస్య పిల్లలు. తండ్రి వదిలేసినట్లు.. తల్లులు పిల్లలని వదిలెయ్యలేరు. ఇక వారిని పెంచే విషయంలో తండ్రి కంటే.. తల్లిదే కీలక పాత్ర ఉంటుంది. అందుకే ఆడవారు ఇన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ రెండో పెళ్లి చేసుకోవడం అనేది కష్టమైనదే.