Advertisement
ఈ కంప్యూటర్ యుగంలో కూడా చిన్న చిన్న విషయాలకే మోసపోతూ ఉన్నారు. ఇటీవల ఫేక్ కాల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. నేరగాళ్లు ఫేక్ కాల్స్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఏదో ఒకరకంగా బెదిరింపులకు పాల్పడడం అనేది కామన్ అయిపొయింది. ఈ బెదిరింపులకు లొంగిపోయిన వారు అడిగినంత ముట్టచెబుతున్నారు. కాని అంతంత డబ్బులు సర్దలేక తలమునకలయ్యేవారు ఎంతో మంది ఉన్నారు.
Advertisement
ఇలాంటి కేసులో చిక్కుకున్న మౌనిక బాధని భరించలేక ఆ*త్మ*హ*త్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెంకు చెందిన మౌనిక అనే అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. ఆమె బీటెక్ చివరి సంవత్సరం చదువుకుంటోంది. ఇటీవల తనకి ఓ కాల్ వచ్చింది. ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందని.. ఆఫర్ లెటర్ పంపాలంటే అందుకోసం 28000 రూపాయలు చెల్లించాలని వారు పేర్కొన్నారు. అది నిజమే అని నమ్మిన మౌనిక స్నేహితుల సాయం తీసుకుని డబ్బు సర్ది పంపించింది.
Advertisement
కానీ, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి డబ్బులు అడుగుతుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఆమె ఈ విషయాన్నీ తన స్నేహితులకు, కాలేజీ యాజమాన్యానికి తెలిపింది. దాంతో వారు ఆమెను మందలించి ఇవన్నీ ఫేక్ కాల్స్ అని పట్టించుకోవద్దని సర్దిచెప్పారు. అయితే.. డబ్బు ఇవ్వనని చెప్పడంతో వారు బెదిరింపులకు దిగారు. ఆమె తల్లితండ్రులు కూడా ఆమెకు సర్దిచెప్పినప్పటికీ మాములు కాలేకపోయింది. పరువు పోయిందని భావించిందో.. వారి బెదిరింపులకు మరింత భయపడిందో.. ఆమె పురుగులు మందు తాగేసింది. ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో ఆమె తల్లి తండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- మరిన్ని Telugu news మరియు తాజా తెలుగు వార్తలు ఇక్కడ చదవండి !