Advertisement
ప్రస్తుతం ఎక్కడ చూసిన వరల్డ్ కప్ గురించిన చర్చలే జరుగుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీం ఇండియా ఆదివారం ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియంలో న్యూజిలాండ్ ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రోహిత్ శర్మ అండ్ కో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గత ఐదు మ్యాచ్‌లుగా విజయం సాధిస్తున్న టీం ఇండియా అత్యుత్తమ రన్ రేట్ ను కలిగి ఉంది. అయితే.. ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన పొరపాట్లు గురించే ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది.
Advertisement
Advertisement
గత ఐదు మ్యాచ్ లలో ఇండియన్ జట్టు నుంచి షమీని ఆడనివ్వలేదు. అతను ఎంత మంచి బౌలర్ అన్న సంగతి తెలిసిందే. అయితే.. రోహిత్ తీసుకున్న తప్పు స్ట్రాటజీలే ఆటలో కొన్ని పొరపాట్లు జరగడానికి కారణం అయ్యాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కూడా షమీ శార్దూల్ ప్లేస్ లో క్రీజ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఐదు వికెట్లను తీసుకున్నాడు.
రోహిత్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఐదు వికెట్లు రావడం గమనార్హం. ఇటువంటి తప్పుడు స్ట్రాటజీ వలెనే పొరపాట్లు జరుగుతున్నాయి. ముందుగా రోహిత్ వీటిని తెలుసుకుని ఆడి ఉంటె బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా శార్దూల్ తో మేనేజ్ చేస్తే సరిపోయింది.ఆ సమయంలో షమిని పంపకుండా ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సూర్య కుమార్ యాదవ్ రన్ అవుట్ అవ్వడం కూడా మరో తప్పిదంలా మారింది.
- మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇవి చుడండి !