Advertisement
సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్దీ రోజులకే పాపులారిటీ తెచ్చుకుని వరుస అవకాశాలతో దూసుకెళ్లి తరువాత ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. ఈయన కెరీర్ ప్రారంభంలో బాగానే సక్సెస్ అయ్యారు.
Advertisement
వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ కూడా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరు. కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ ఆ తరువాత మనసిచ్చి చూడు, పెళ్లి వంటి సినిమాలతో మరింత పాపులర్ అయ్యారు. ఆయనకు మంచి గుర్తింపు రావడంతో స్టార్ హీరో అవుతాడని అందరు అనుకున్నారు. కానీ ఆ తరువాత నవీన్ ను వరుస ఫ్లాప్ లు చుట్టుముట్టాయి.
ఈ సమయంలోనే నవీన్ తండ్రి వడ్డే రమేష్ తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్న ఎన్టీఆర్, దాసరి ల సాయంతో ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరికి వడ్డే నవీన్ ను ఇచ్చి వివాహం చేయాలనీ అనుకున్నారు.
Advertisement
ఈ విషయాన్నీ దాసరి చేతే ఎన్టీఆర్ ను అడిగించారు వడ్డే రమేష్. ఇది ఎన్టీఆర్ బతికున్నప్పుడు జరిగింది. ఆయనకూడా ఈ వివాహానికి అంగీకారం తెలిపారు. ఆయన మరణించిన తరువాత కూడా ఇదే మాట మీద లోకేశ్వరికి వడ్డే నవీన్ ను ఇచ్చి పెళ్లి చేసారు. ఎన్టీఆర్ కు అల్లుడు అవడంతో ఆయనకు అవకాశాలు బాగానే వచ్చాయి.
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న వడ్డే నవీన్ కు హీరోయిన్ మహేశ్వరితో పరిచయం ఏర్పడింది. అయితే.. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రేమ అంటూ పుకార్లు పుట్టాయి. వీటిల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ, ఈ పుకార్ల వలన వడ్డే నవీన్ కు, లోకేశ్వరి మధ్య చాలా అపార్ధాలు చోటు చేసుకున్నాయి.
దీనితో లోకేశ్వరి వడ్డే నవీన్ నుంచి విడాకులు తీసుకుంది. దీనితో.. వడ్డే నవీన్ కు వచ్చిన అవకాశాలన్నిటిలో.. ఆయనను తప్పించి మరో హీరోతో సినిమాను పూర్తి చేసేవారు. దీనితో నవీన్ పూర్తిగా ఫేడ్ అవుట్ అయినట్లయింది. మొన్న ఆమధ్య రామ్ గోపాల్ వర్మ సినిమాతో నవీన్ “ఎటాక్” సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు కానీ, ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.