Advertisement
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. అభినయం, నటన ప్రతిభతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన హీరోయిన్ల పేరులో ఐశ్వర్య పేరు ముందుంటుంది. “నీతం అవన్” అనే ఓ తమిళ సినిమా ద్వారా ఐశ్వర్య హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
Advertisement
ఇతర టాప్ హీరోయిన్స్ తో పోలిస్తే ఆమె అందం విషయం పక్కన పెడితే.. అభినయం విషయంలో మాత్రం ముందు ఉంటారు. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’, టక్ జగదీశ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, వంటి సినిమాల్లో నటించారు. టక్ జగదీశ్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
చాలా మంది ఈమెకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేదు అనుకుంటారు. కానీ ఆమె తండ్రి రాజేష్ Rajesh కు నిన్నటి తరంలో చాల ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించారు. వాటిల్లో ఒకటి నెలవంక సినిమా. ఈ సినిమా అప్పట్లోనే తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది.
Advertisement
ఆ తరువాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ, ఏ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. ఆ తరువాత దురదృష్టవశాత్తూ ఆయన కాలం చేసారు. దీనితో.. ఐశ్వర్య తల్లే కుటుంబ పెద్దగా ఉండి పిల్లలను చదివించారు.
తండ్రి నటుడు కావడంతో.. ఐశ్వర్య రాజేష్ చిన్నతనంలో రాజేంద్రప్రసాద్ “రామబంటు” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తరువాత 2010 వరకు సినిమాల వైపు చూడలేదు. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదించి అమ్మకి సాయం చేసేది. ఆ స్థాయి నుంచి నేడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఐశ్వర్య చేరుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు మలయాళం సినిమాలు, నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి.
మరిన్ని..
- మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !
- మీరు కనుక సోషల్ మీడియా లో ఉన్నట్టయితే మా Facebook ని ఇక్కడ ఫాలో అవ్వండి.