Advertisement
Daily Current Affairs in Telugu 2023: ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు కరెంట్ ఎఫైర్స్ చాలా ముఖ్యం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ని తీసుకున్నప్పటికీ కరెంట్ అఫైర్స్ లేనిది ఈ పరీక్షనే ఉండదంటే అతిశయోక్తి కాదు.
Advertisement
నిత్యం మన కళ్ల ముందల జరిగేవి.. మనం నిత్యం చూసేవి.. వినేవే ఈ కరెంట్ అఫైర్స్..కానీ వీటిని చాలా మంది లైట్ తీసుకుంటారు. వీటిని గుర్తుంచుకుంటే మీ జీవితానికి తప్పకుండా ఉపయోగపడుతాయి. ఇంకెందుకు ఆలస్యం .. ఈ రోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం.
Advertisement
- ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్ మ్యూజియంలో ఉన్నటువంటి ఆయన ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంతో ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- ఇనుముతో తయారైన అత్యంత పదునైన ఆయుధాన్ని అనగా పులిగోళ్లతో తయారు చేసిన ఆ ఆయుధాన్ని శివాజీ ఉపయోగించారు. తెల్ల దొరల పాలన కాలంలో ఈస్ట్ ఇండియాకు చెందిన అధికారి జేమ్స్ గ్రాండ్ డఫ్ పులిగోళ్ల ఆయుధాల సెట్ ను విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియానికి ఇచ్చేశారు. మూడేళ్ల పాటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆయుధాన్ని అక్కడి మ్యూజియాల్లో ప్రదర్శించనుంది.
- I2U2 అంతర్జాతీయ కూటమిగా తాజాగా ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ కూటమిలో నాలుగు సభ్యు దేశాలు కలవు. అవి భారత్, యూఎస్ఏ, యూఏఈ, ఇజ్రాయెల్.
- బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా జరిగిన కులగణన గణాంకాలను విడుదల చేసింది. రాష్ట్ర జనాభా 13,07,25,310 కాగా.. వీరిని 215 సామాజిక గ్రూపులుగా విభజించారు. ఈబీసీ 36%, ఓబీసీ 27.13% వరకు జనాభా ఉన్నట్టు వెల్లడి అయింది. మొత్తానికి అక్కడ వెనుకబడిన వర్గాల జనాభా సుమారు 63% ఉన్నారు. అందులో ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68%.
- ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన టోర్నమెంట్ లోని 24వ మ్యాచ్ లో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు మ్యాక్స్ వెల్. ఈ మ్యాచ్ లో 44 బంతుల్లో 106 పరుగులు చేశాడు.. అందులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇదే టోర్నీలో శ్రీలంకపై దక్షిణాప్రికా బ్యాటర్ మార్క్ రమ్ 49 బంతుల్లో సాధించిన రికార్డును మ్యాక్స్ వెల్ బద్దలు కొట్టాడు.
- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) దేశవ్యాప్తంగా అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్ తో భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ ప్రతిపాదనను స్వాగతించింది.
- అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఇటీవలే ప్రతిష్టాత్మక వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ను వరుసగా అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ లకు ప్రదానం చేశారు. అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతో మంది జీవిత నాణ్యతను మెరుగుపరిచింది.
- సినిమాల్లో ఆఫ్రికన్ అమెరికన్ పురుషత్వాన్ని పునర్ నిర్మించిన దిగ్గజ నటుడు రిచర్డ్ రౌండ్ ట్రీ. ‘షాప్ట్’ లో టైటిల్ రోల్ ను పోషించిన నటుడు రిచర్డ్ రౌండ్ ట్రీ (81) ఫ్యాంకియాటిక్ క్యాన్సర్ తో లాస్ ఏంజిల్స్ కన్నుమూశారు. ఇతను మొదటి నల్లజాతి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు.
26 అక్టోబర్ 2023 రోజు వారి కరెంట్ అఫైర్స్ PDF కొరకు ఇక్కడ మీరు చూడవచ్చు.