Advertisement
Popular RGV Quotes: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన టాప్ డైరెక్టర్ మాత్రమే కాదు స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత, కవి కూడా. ఆయన కవి అన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ, రామ్ గోపాల్ వర్మ చాలానే చిన్న చిన్న వచన కవితలను రాసారు. వాటిని చదివితే మీరు కచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. ఆర్జీవీ ‘నా ఇష్టం’ అనే ఆత్మకథ పుస్తకాన్ని కూడా రాసిన సంగతి తెలిసిందే. పేరుకి తగ్గట్లే ఆయన ప్రతి విషయంలో తనకి నచ్చినట్లే బతుకుతూ ఉంటారు.
Advertisement
జీవితాన్ని పూర్తి స్థాయిలో, పూర్తి హక్కులతో ఆనందంగా గడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చాలా మందికి ముందు గుర్తుకు వచ్చే వ్యక్తి ఆర్జీవీ. జీవితం, స్వేచ్ఛ, ప్రేమ, వివాహం, సెక్స్, వ్యక్తిత్వం, సమాజం, దేవుడు, రాజకీయాలు, డబ్బు, తెలివితేటలు, మరణం వంటి అన్ని అంశాల గురించి ఆర్జీవీ తన ఆలోచనలను రామూయిజంకి చూపించారు. ఇప్పటి వరకు ప్రజలలో పాతుకుపోయిన తత్వశాస్త్రం, సంప్రదాయాలు మరియు నమ్మకాలకు విభిన్నంగా రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు ఉంటాయి. నేటి భారతీయ యువతపై ఆర్జీవీ భావజాలం ప్రభావం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఆర్జీవీ భావజాలాన్ని ప్రతిబింబించే Ram Gopal Varma Telugu Quotes కవితలను మీరు ఇక్కడ చదవచ్చు.
Advertisement
Top 50 Ram Gopal Varma Telugu Quotes
- చావు ఏ క్షణంలోనైనా రావొచ్చు అని తెలుసుకున్నవాడే ప్రతినిమిషం ఆనందంగా బతకగలడు.
- తెలివైనవాడు నీటి లోతుని ఒక కాలితో కొలుస్తాడు మూర్ఖుడు రెండు కాళ్లు పెట్టి కొలుస్తాడు నాలాంటి జీనియస్ మాత్రంవేరే వాడి కాళ్లతో కొలుస్తాడు.
- నాకు స్నేహితులకంటే శత్రువులే ఇష్టం. ఎందుకంటే శత్రువులు మనల్ని ఎప్పుడు అలర్ట్ గా ఉంచుతారు. గా స్నేహితులు ఏమరుపాటు పెంచుతారు.
- చాలామంది పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటారంటే 365 రోజుల్లో కనీసం ఆ ఒక్క రోజన్నా కనీసం కొంతమంది ముందైనా ఫేమస్ గా ఫీలవడం కోసం.
- ఎప్పుడు రాజకీయ నాయకుల్ని విమర్శించే సాధారణ పౌరుడు, రాజకీయ నాయకుడు కాగలిగితే, రాజకీయ నాయకులకంటే ఎక్కువగా దోచుకుంటాడు.
- ఒక మనిషికి సాయం చేయడంలో ఇబ్బంది ఏంటంటే, అతనికి మళ్ళీ సాయం కావాల్సినపుడు మనమే గుర్తొస్తాం.
- ప్రార్థన మనిషికి సక్సెస్ ఇచ్చేటట్లయితే, చాలామంది పూజారులు ఎందుకు పేదరికంలో ఉన్నారు ?
- కుక్కని మనం కుక్క అని ఎలా అయితే అనుకుంటామో దాని దృష్టిలో మనం కూడా అంతే.
- మీరు మీ పేరెంట్స్ నుంచి విన్నది, చదువులో నేర్చుకున్నది, సొసైటీ నుంచి నేర్చుకున్నది ఎంత తొందరగా వదిలేస్తే అంత త్వరగా మీరు డిఫెరెంట్ అవుతారు.
- అభద్రతా భావం, విపరీతమైన ఆత్మనూన్యత ఉన్న వాళ్ళే ఎక్కువగా ఫ్రెండ్స్ ని కోరుకుంటారు.. నాకు ఫ్రెండ్స్ లేరు.
- ప్రతి ఓక్కడికి గెలవాలనే ఉంటుంది కాని ఓటమి తట్టుకుని ఎవడైతే నిలబడుతాడో వాడే గెలుస్తాడు.
- గుంపు నుంచి వేరుగా నిలబడలేని ధైర్యం లేకపోతే ఎప్పటికీ గుంపులో ఒకడిగానే మిగులుతాం.