Advertisement
భారతదేశాన్ని బ్రిటీషు వాళ్ళు దోచుకున్నారు అని చెబుతూ ఉంటారు. అయితే.. భారత దేశ సంపదని దోచుకెళ్లి బ్రిటిష్ కు తరలించిన వారిలో రాబర్ట్ క్లైవ్ కీలక వ్యక్తి. ఇతను పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ కు వచ్చాడు. భారత్ కు వచ్చాక ఇతను ఓ ఈస్ట్ ఇండియా కంపెనీకి గుమస్తాగా చేరాడు. ఇక్కడ ఉద్యోగంలో చేరాకా మొఘలులతో పాటు ఇతర భారతీయ రాజులతో పోరాడి బ్రిటిష్ వారికి అనేక లాభాలను చేకూర్చాడు. భారత దేశంలో దోచుకోవడం ప్రారంభించాడు.
Advertisement
తద్వారా బ్రిటిష్ వారి ఖజానాతో పాటు తన ఖజనాని కూడా నింపుకున్నాడు. అక్రమంగా తన ఖజనాని నింపుకోవడంతో ఈయనపై అవినీతి కేసు నమోదయ్యింది కూడా. ఇతనిపై కేసు నమోదు అయ్యాక విచారణ జరిపారు. భారత దేశం నుంచి ఎన్ని వస్తువులను దోచుకుని బ్రిటిష్ ఖజానాకు పంపారు అంటూ ఈయనను విచారణలో ప్రశ్నించారు. దానికి ఇతను చెప్పిన సమాధానం విని అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇతను మొత్తం తొమ్మిది వందల నౌకల్లో భారత దేశ సంపదలను తరలించాడట.
Advertisement
వాటిల్లో వెండి, బంగారాలతో పాటు ఇతర ఖరీదైన వస్తువులను కూడా బ్రిటన్ ప్రభుత్వానికి పంపించానని తెలిపాడట. ఇక భారత దేశంలో విభజించు పాలించు విధానాన్ని ప్రారంభించింది కూడా ఈ మహానుభావుడే. ఈ ప్రక్రియ ద్వారా బ్రిటిష్ వారు ఎంత లబ్ది పొందారో మనకి తెలియనిది కాదు. 1767 వ సంవత్సరంలో రాబర్ట్ భారతదేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళాడు. భారత దేశం నుంచి అతను నిర్దోషిగానే విడుదల అయ్యాడు. కానీ, ఇంగ్లాండ్ లో మాత్రం మళ్ళీ అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. రాబర్ట్ చిన్నతనం నుంచి టఫ్ స్టూడెంట్. లండన్‌లోని మర్చంట్ టేలర్స్ స్కూల్‌తో సహా అనేక పాఠశాలలో చదవాల్సి వచ్చింది. టీనేజిలో ఉండగానే ఈస్ట్ ఇండియా కంపెనీలో సర్వీస్ కోసం చెన్నై కి వచ్చేసాడు. ఆ తరువాత భారత దేశాన్ని దోచుకునే పనిలో పడ్డాడు.
మరిన్ని..
1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350cc ధర ఎంతో తెలుసా? వైరల్ అవుతున్న బిల్!
ఇన్ని నిందలు వేస్తున్నా.. ఉదయ్ కిరణ్ భార్య విషిత ఎందుకు సైలెంట్ గా ఉంది?
రజినీకాంత్ తెర వెనుక అంత సింపుల్ గా ఎందుకు ఉంటారో తెలుసా? అసలు కారణం ఇదే..!