Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 కోసం బీసీసీఐ వేలం వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ 2023 జరుగుతుండగానే రాబోయే ఐపీఎల్ వేలం కోసం బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దుబాయ్ లో ఈ ఈవెంట్ చేయాలనీ ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ కు విస్తృతంగా ప్రచారం లభించడం కోసమే ఈ ప్లాన్ అని తెలుస్తోంది. డిసెంబర్ 15 మరియు 19 మధ్య తేదీలలో ఈ ఆక్షన్ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
IPL వేలానికి ముందు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం డిసెంబర్ 9 న జరగనుంది. WPL వేలం కోసం ఖచ్చితమైన ప్రదేశం ఖరారు కానప్పటికీ, ఇది భారతదేశంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్రాంచైజీలకు అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అయితే ఐపీఎల్ వేలం దుబాయ్‌లో జరుగుతుందని, డిసెంబర్ 18 లేదా 19 తేదీల్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్లు క్రికెట్ సంఘాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Advertisement
BCCI మునుపటి సంవత్సరం వేలాన్ని ఇస్తాంబుల్‌లో నిర్వహించాలని భావించింది, అయితే చివరికి దానిని కొచ్చిలో నిర్వహించింది. IPL కోసం ట్రేడింగ్ విండో ప్రస్తుతం తెరిచి ఉంది కానీ ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ చేయబడలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ విజయవంతం అయిన తరువాత, BCCI రెండవ సీజన్‌ను విస్తరించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం కోసం వేదిక మరియు తేదీలకు సంబంధించిన సమాచారాన్ని బోర్డు ఇంకా జట్టు యజమానులకు అందించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లీగ్‌ను షెడ్యూల్ చేయవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతకుముందు సీజన్లో లీగ్ మొత్తం ముంబైలో జరిగింది. WPL మునుపటిలా ఒకే నగరంలో నిర్వహించబడుతుందా లేదా ఈసారి అనేక చోట్ల జరుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని..
Martin Luther King Review in Telugu: మార్టిన్ లూథర్ కింగ్ కథ, రివ్యూ & రేటింగ్..!
Leo OTT: Release Date, Platform, Satellite Rights, and Streaming Date
భారత్ ను లూటీ చేసి అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్న ఆంగ్లేయుడు.. ఇతని గురించి తెలుసుకుంటే?