Advertisement
గృహమే కదా స్వర్గసీమ అని అంటూ ఉంటారు. మన జీవితంలో ఎక్కువ సమయం మనం ఇంటిలోనే గడుపుతూ ఉంటాం. అందుకే అటువంటి ఇంటిని స్వర్గంలా తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా, నెగటివ్ ఎనర్జీ మన వైపుకు రాకుండా ఇంటిని తీర్చిదిద్దుకోవాలి. ప్రతి ఇంట్లోనూ ఈశాన్య దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ దిక్కులో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే ఆ దిక్కుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలన్నా.. ఇంట్లో ఆర్ధిక నష్టాలూ ఉండకూడదు అన్నా.. ఈశాన్య దిక్కు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
Advertisement
ఈ సాంకేతిక యుగంలో కూడా వాస్తు విషయాలను తూచా తప్పకుండ పాటించేవారు చాలా మందే ఉన్నారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంట్లోని నిర్మాణాలకు మాత్రమే కాదు.. ఇంట్లోని వస్తువులకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో ఏ దిశలో ఎలాంటి వస్తువులను పెట్టాలి? ఎలాంటి వస్తువులను పెట్టకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి. ఈశాన్యాయానికి అధిపతీ ఈశ్వరుడు కావడం వలన ఈ దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ దిక్కు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కు వైపు పూజ గది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటె ఏర్పాటు చేసుకోవాలి.
Advertisement
ఈ దిక్కు వైపు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. దీని వలన నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ దిక్కు వైపు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దేవుడి పటాలను వీలైనంత అలంకరించాలి. ఈ దిక్కులో ఎట్టి పరిస్థితిలో బాత్ రూమ్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ బాత్ రూమ్స్ ఉంటె ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. చెప్పులు, షూస్, చెత్తకుండీలు లాంటివి ఈశాన్య దిక్కులో ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటి వస్తువులను ఈశాన్య దిక్కులో పెట్టడం వలన ఇంట్లో గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు అంటున్నారు.