Advertisement
క్రికెట్ లెజెండ్ గ్రెగ్ చాపెల్ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అతని స్నేహితులు నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 75 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, 2005-2007 మధ్య భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఈయన అప్పట్లోనే వివాదాస్పద కోచ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇతని గురించి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో స్పందించిన గ్రెగ్ తాను బాగానే ఉన్నానని, అయితే క్రికెట్ కెరీర్ లో ఉన్నప్పటికి లగ్జరీ లైఫ్ మాత్రం అనుభవించడం లేదని తెలిపారు.
Advertisement
తీరని కష్టాల్లో ఉన్నానని నేను చెప్పడం లేదని, అలా అని నేనేమీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నానని కూడా చెప్పడం లేదన్నారు. క్రికెట్ కెరీర్ లో ఉన్నాను కాబట్టి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటానని అందరు అనుకుంటారని.. కానీ అది నిజం కాదని అన్నారు. నేను పేదవాడిని అని ఏడవడం లేదని, నేటి ఆటగాళ్లు పొందుతున్న ప్రయోజనాలను మేము పొందడం లేదని చెప్పుకొచ్చాడు. రిపోర్ట్స్ ప్రకారం గత వారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన టెస్టిమోనియల్ లంచ్‌తో పాటుగా తన కోసం ఏర్పాటు చేయబడుతున్న గో ఫండ్ మి పేజీకి చాపెల్ “అయిష్టంగానే” ఒప్పుకున్నాడు. దీనిని ఎడ్డీ మెక్‌గ్యురే హోస్ట్ చేసారు మరియు సోదరులు ఇయాన్‌తో సహా క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు.
Advertisement
ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కు ఇప్పటికి చాలా కాలం అవ్వడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనట్లు చాపెల్ చెప్పుకొచ్చారు. మాకు పెద్దగా లాభాలేమి రాలేదని.. రిటైర్మెంట్ వయసులో జూడీ మరియు నేను సుఖంగా ఉన్నామని మా స్నేహితులు నిర్ధారించుకున్నారని అన్నారు. గత ఎరా లో క్రికెట్ అభివృధ్ధికోసం పాటు పడిన వారికి క్రికెట్ తగినంత చేసిందని నేను అనుకోవడం లేదని.. ఇప్పటి పరిస్థితుల కంటే గతంలో పరిస్థితులు కఠినమని గ్రెగ్ పేర్కొన్నారు. గ్రెగ్ స్నేహితుడు మాట్లాడుతూ.. “గ్రెగ్ చాలా గర్వించదగిన వ్యక్తి. అతను చెప్తున్నా దానికంటే కఠినమైన పరిస్థితులలో ఉన్నారని” చెప్పుకొచ్చాడు.
మరిన్ని తెలుగు క్రికెట్ వార్తలని ని ఇక్కడ మీరు చూడొచ్చు ! తెలుగు న్యూస్ కొరకు ఇటు చుడండి !