Advertisement
Pawan Kalyan Wife: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్నా లెజినోవా మూడవ భార్య అన్న సంగతి తెలిసిందే. తొలుత నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ కొద్దీ కాలానికే విడాకులు ఇచ్చేసాడు. వీరికి పిల్లలు కలగలేదు. ఆ తరువాత హీరోయిన్ రేణు దేశాయ్ తో పవన్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని చాలా కాలం పాటు కలిసే ఉన్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. అనుకోకుండా వీరిద్దరికి అభిప్రాయ భేదాలు రావడంతో.. వీరిద్దరూ విడిపోయారు. వీరు విడిపోయిన చాలా కాలానికి పవన్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు.
Advertisement
వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా అని ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఒక ఫారిన్ కుటుంబలో పుట్టి పెరిగిన లెజినోవా పవన్ కి భార్యగా ఎలా మారారు? మెగా ఫ్యామిలీలో ఆమె ఎలా అడ్జస్ట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. లెజినోవా పెద్దగా బయటకు రారు. ఆమె తన ఫ్యామిలీ తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. హై స్కూల్ గ్రాడ్యుయేషన్ మాత్రమే పూర్తి చేసిన అన్నా ఆ తరువాత మోడలింగ్ లో అడుగు పెట్టారు. తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలోనే అన్నా లెజినోవాకు పవన్ కళ్యాణ్ కు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30 2013 లో ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Advertisement
అప్పటినుంచి లెజినోవా పూర్తిగా భారతీయ మహిళగా మారిపోయారు. పవన్ లాగే కాటన్ దుస్తులు ధరించడం, ఫ్యామిలీ తరపున ఫంక్షన్స్ లో పూర్తి స్థాయి భారతీయ వస్త్ర ధారణలో కనిపించి వ్వావ్ అనిపిస్తున్నారు. ఇక భారతీయ సంప్రదాయాల పట్ల ఆమెకు పూర్తి అవగాహనా లేకున్నా పవన్ కళ్యాణ్ కు వీర తిలకం దిద్దడం, కార్ కు దిష్టి తీసి కొబ్బరి కాయలు లాంటివి పగలగొట్టడం చూస్తుంటే ఆమె భారతీయ సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలుస్తుంది. ఇక మెగా ఫ్యామిలీతో కూడా ఆమె చక్కగా కలిసిపోతారు. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్ళిలో కూడా భారతీయ వస్త్రధారణలో కనిపించిన ఆమె చురుకుగా పాల్గొని ఫ్యామిలీతో ఎలా కలిసిపోయారో చెప్పకనే చెప్పారు.
మరిన్ని..
ఓటిటిలోకి రాబోతున్న మంత్ ఆఫ్ మధు సినిమా.. ఎప్పుడంటే? ఎందులో చూడొచ్చంటే?
నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే రోడ్డుపై మరణించిన ఈ నందమూరి ఎవరో తెలుసా?
ఈ అమ్మాయి ఎంత మంచి భార్యనో.. వైరల్ వీడియో చూసి కితాబిస్తున్న నెటిజన్స్..!