Advertisement
భారత దేశంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలను అన్నిటిని ఆర్బీఐ చూస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత దేశంలో ఆర్ధిక వ్యవస్థ నగదు రహిత సమాజంగా అడుగులేస్తోంది. ఇప్పటికే తనఖాలు, అప్పుల స్థానంలో క్రెడిట్ కార్డు లు పెద్ద పీట వేసుకుని కూర్చున్నాయి. అయితే.. ఇవి అసురక్షిత రుణ రకం కిందకు వస్తుంది. క్రెడిట్ కార్డు వంటి వాటిల్లో డిస్కౌంట్స్, ఆఫర్స్ లాంటివి కూడా ఉంటాయి. అందుకే చాలా మంది వీటికి ఆకర్షితం అవుతూ ఉంటారు.
Advertisement
అయితే.. ఎవరైనా ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు తీసుకుని అందులో అప్పు చేసి.. ఆ అప్పు తీర్చకుండానే చనిపోతే ఆ బాధ్యత ఎవరిపై పడుతుంది? ఈ సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే.. ఇప్పటివరకు ఈ బాధ్యత సదరు వ్యక్తికి చెందిన కుటుంబంలోని ఇతర సభ్యులపై పడుతూ వస్తోంది. కుటుంబంలో సంపాదన కలిగిన ఓ వ్యక్తి చనిపోతే.. ఆ కుటుంబంపై ఆర్ధికంగా ఎంత భారం పడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ పరిస్థితులలో క్రెడిట్ కార్డుల భారం కూడా అదనం అవుతుంది.
Advertisement
ఈ క్రమంలో ఆర్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునే వ్యక్తికి అతని యోగ్యతకి తగ్గట్టు సురక్షిత క్రెడిట్ కార్డు అందించబడుతుంది. అయితే.. ఇందుకోసం అతను తాకట్టు కింద కొంత మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సదరు కార్డు వినియోగదారుడు మరణించినప్పటికీ ఆ అప్పుని, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న కొలేటరల్ కవర్ చేస్తుంది. బ్యాంకులు కూడా అతని ఇతర కుటుంబ సభ్యులను ఈ అప్పుకి బాధ్యులను చేయవు.
మరిన్ని..
ఓటిటిలోకి రాబోతున్న మంత్ ఆఫ్ మధు సినిమా.. ఎప్పుడంటే? ఎందులో చూడొచ్చంటే?
నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే రోడ్డుపై మరణించిన ఈ నందమూరి ఎవరో తెలుసా?
ఈ అమ్మాయి ఎంత మంచి భార్యనో.. వైరల్ వీడియో చూసి కితాబిస్తున్న నెటిజన్స్..!