Advertisement
టాలీవుడ్ లో నిన్నటి తరం స్టార్ నటి సిల్క్ స్మిత 2 డిసెంబర్ 1960 లో జన్మించారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాలతో పాటు ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో సిల్క్ స్మిత నటించారు. 1980లలో దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన శృంగార నటిగా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. అయితే.. జీవిత చరమాంకంలో మాత్రం ఆమె చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. పట్టించుకునే నాధుడు లేక.. ఆమె ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు.
Advertisement
మహానటి సావిత్రి కూడా జీవిత చరమాంకంలో ఎన్ని ఇక్కట్లు పడ్డారో తెలిసిందే. ఆమె ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఆమె దయార్ద్ర హృదయంతో అన్నిటిని అందరికి ఇచ్చేసుకుంటూ వచ్చి.. చివరకు తనకంటూ ఏమి మిగలకుండా చేసుకున్నారు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన గురించి తెలుసుకుంటే సిల్క్ స్మిత కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారా అని అనిపించక మానదు. సిల్క్ స్మిత హీరోయిన్ గా చేసిన తరువాత.. ప్రొడ్యూసర్ గా కూడా ఆమె తన అదృష్టాన్ని పరిష్కరించుకోవాలని అనుకున్నారు.
Advertisement
ఆ క్రమంలోనే ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేసారు. ఆ సినిమాకు డైరెక్టర్ కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారట. డైరెక్టర్ కృష్ణ వంశి ఫామ్ లోకి రాకముందు లైట్ మాన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసారు. ఆయనతో పనులు చేయించుకున్న వారెవరు సరిగ్గా శాలరీ కూడా ఇచ్చేవారు కాదట. ఆ టైం లోనే సిల్క్ స్మితకు కృష్ణ వంశి పనిచేశారట. ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ, కృష్ణ వంశి పని చేసినందుకు గాను, సిల్క్ స్మిత ఆయనకు అప్పట్లోనే ఐదు వందల రూపాయలను ఇచ్చారట. ఇది అప్పటివరకు కృష్ణ వంశి తీసుకున్న జీతాల కంటే చాలా ఎక్కువట. ఈ విషయాన్నీ కృష్ణ వంశినే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఆమెది అంత మంచి మనసు కాబట్టే ఆస్తంతా కరిగిపోయి.. జీవిత చరమాంకంలో అన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
మరిన్ని..
ఆర్బీఐ కొత్త రూల్.. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే, మిగిలిన బాకీ ఎవరు చెల్లించాలి?
పవన్ భార్య అన్నా లెజినోవా గురించి ఈ విషయాలు తెలుసా? గ్రేట్ అనకుండా ఉండలేరు!
ఈ ఫొటోలో పవన్ భార్య లెజినోవా ఎత్తుకున్న అబ్బాయి ఎవరో గుర్తు పట్టారా ? ఎవరో చెప్పగలరా?