Advertisement
తెలుగు సినిమా ప్రేక్షకులకు విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన వాస్తవానికి తమిళ సినిమా నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను చూడడం, ఆయన కొన్ని తెలుగు సినిమాలలో నటించడం వలన తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతిపై చాలానే అభిమానం ఉంది. 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా విజయ్ సేతుపతి స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించారు. ఆ తరువాత 2021 లో ఉప్పెన అనే సినిమాలో కూడా పూర్తి స్థాయి నటుడిగా నటించారు.
Advertisement
ఈ రెండు సినిమాలు విజయ్ సేతుపతికి తెలుగు నాట తిరుగులేని ఫాలోయింగ్ ను తెచ్చి పెట్టాయి. అయితే.. సినిమాలు ఎంచుకోవడంలో కూడా విజయ్ సేతుపతిది ప్రత్యేకమైన శైలి. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా సినిమాను ఎంచుకోవడంలో కూడా విజయ్ సేతుపతిది వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పవచ్చు. టాలెంట్ సంగతి పక్కన పెడితే… ఆఫ్ స్క్రీన్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి కూడా అభిమానులు చాలా మందే ఉన్నారు. దానికి ఓ గొప్ప ఉదాహరణని ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఉప్పెన సినిమా తరువాత విజయ్ సేతుపతికి ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకుంటున్నాం అని చిత్ర బృందం తెలిపిందట. అయితే.. వెంటనే విజయ్ సేతుపతి ఈ సినిమా ఆఫర్ ని తిరస్కరించారట. అందుకు కారణం ఏమిటో తెలుసా.. ఉప్పెన సినిమాలో నేను కృతిశెట్టికి తండ్రిగా నటించాను అని.. ఆమె నాకు కూతురు లాంటిది. ఆమెకి సినిమా షూటింగ్ సమయంలోనే నేను తండ్రి లాంటి వాడిని అని చెప్పా. అలాంటిది ఆమె హీరోయిన్ గా ఉంటె పక్కన నేను హీరోగా ఉండి రొమాన్స్ చేయడం అస్సలు బాగోదు.. అని సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఈ విషయం తెలిసాక అందరికి విజయ్ సేతుపతి మీద రెస్పెక్ట్ మరింత పెరుగుతోంది.
మరిన్ని..
ఆర్బీఐ కొత్త రూల్.. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే, మిగిలిన బాకీ ఎవరు చెల్లించాలి?
Pawan Kalyan Wife Anna Lezinova: పవన్ భార్య అన్నా లెజినోవా గురించి ఈ విషయాలు తెలుసా?