Advertisement
Find the Best Collection of Telugu Riddles with Answers and PDF: ఇప్పుడంటే సుడోకులు, పజిల్స్ లాంటివి అనేకం వచ్చాయి కానీ పాతకాలం వారికి కాలక్షేపానికి పొదుపు కథలే ఎక్కువగా ఉండేవి. పొడుపు కథలను (Telugu Riddles) చెప్పుకోవడం, వాటి చిక్కు ముడులను విప్పడమే పనిగా ఉండేది. దీనితో బ్రెయిన్ లో గుజ్జు పెరగడంతో పాటు బోలెడు కాలక్షేపం కూడా అయ్యేది. ఇవి నిజంగా చాలా సరదాగా ఉంటాయి. అలాంటి అమ్మమ్మల కాలం నాటి పొడుపుకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో కొన్నిటిని చిక్కు విప్పగలిగితే మీరు కూడా ట్రై చేయండి.
Advertisement
Advertisement
Telugu Riddles and Answers in Telugu and English
- కొత్త పెళ్లి కొడుకు బట్టలు విప్పేసి బావిలో దూకాడు కానీ, తిరిగి బయటకు రాలేడు.. ఎవరది?
జవాబు: అరటిపండు - Kottha pelli koduku battalu vippesi dookadu kaani tirigi bayataku raledu evaradi ?
answer: aratipandu - దాచుకుంటే పిడికిలితో దాగుతుంది. తీసేస్తే ఇల్లంతా పాకిపోతుంది. ఏమిటది?
జవాబు: దీపం వెలుగు - Daachukunta pidikilitho daaguthundhi tesesthe illanta paakukuntundhi emitadhi ?
answer: deepam velugu. - దేహమంతా కళ్ళు కానీ దేవేంద్రుడిని కాదు. నరవాహనం లేకుండా నడవలేను. నాకు జీవం లేదు కానీ, జీవులను చంపుతుంటాను.
జవాబు: వల - Dehamantha kallu kaani devendruni kaadhu nravaahanam lekunda nadavalaenu naku jeevam ;edhu kaani jeevulani champuthanu!
answer: vala - పొట్టి వాడినే కానీ నా వళ్లంతా బట్టలే. నేను ఎవరిని?
జవాబు: ఉల్లిపాయ - ఇల్లంతా తిరుగుతాను, కానీ మూలాన కూర్చుంటాను నేనెవరిని?
జవాబు: చీపురు - తోకలేని పిట్టని. కానీ, తొంభై ఆమడల దూరం పోతాను. నేను ఎవరిని?
జవాబు: ఉత్తరం - చక్కని రాజుని. కానీ నా ఒళ్ళంతా బొచ్చే. నేనెవరిని?
జవాబు: పొలం గట్టు - చక్కని రాజుకి ఒళ్ళంతా ముత్యాలు. నేనెవరిని?
జవాబు: మొక్కజొన్న కంకి - వేలెడంత పిల్లోడు చీరంతా తిరిగాడు. ఎవరో మీకు తెలుసా?
జవాబు: సూది - ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ.. అదేంటో తెలుసా?
జవాబు: తాటికాయ - నల్ల బండ కింద నలుగురు దొంగలు? ఏమిటది?
జవాబు: గేదె, గేదె పొడుగు - కిట కిట తలుపులు కిటారి తలుపులు. ఎప్పుడు మూసినా, తెరచినా చప్పుడు కావు. ఏమిటవి?
జవాబు: కళ్ళు - తనువంతా రంధ్రాలు కానీ, తీయగా పడతాను. నేనెవరిని?
జవాబు: పిల్లనగ్రోవి - గంపెడు శనగల్లో ఓ గులకరాయి. నేనెవరిని?
జవాబు: చందమామ - ఒళ్ళంతా ముళ్ళే కానీ రత్నాల్లాంటి బిడ్డలు. నేనెవరిని?
జవాబు: పనస పండు - అయ్యా అన్నప్పుడు దూరంగా వెళ్లి, అమ్మా అన్నప్పుడు దగ్గరకి వచ్చేవి ఏమిటి?
జవాబు: పెదవులు
మరికొన్ని వీటిని కూడా చుడండి :