Advertisement
చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ లభించింది. చంద్రబాబు నాయుడు దాదాపు నెల రోజుల పైనే జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు హై కోర్ట్ పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేయాల్సి ఉందని నయీం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిఐ ప్రకారం, కోర్టు అతని రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 10కి వాయిదా వేసింది. రెండు పూచీకత్తులతో ₹ 1 లక్ష బెయిల్ బాండ్‌ను టీడీపీ అధినేత అందించాలని ధర్మాసనం ఆదేశించింది. “అతను తన ఖర్చుతో తనకు నచ్చిన ఆసుపత్రిలో తనను తాను పరీక్షించుకోవాలి మరియు చికిత్స పొందాలి” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Advertisement
అయితే చంద్రబాబు నాయుడుని బెయిల్ పై విడుదల చేయడానికి ఆయనకీ కొన్ని ఆంక్షలను కూడా కోర్టు విధించింది. ఆసుపత్రికి వెళ్లడం, చికిత్స తీసుకోవడం మినహా ఆయన ఏ ఇతర బహిరంగ కార్యక్రమానికి హాజరు కావడానికి వీలు లేదని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి కానీ, ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడడానికి కానీ వీలు లేదని పేర్కొంది. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు నాయుడు బయటకు వస్తూనే మీడియా ముందు బహిరంగంగా మాట్లాడారు.
Advertisement
నేను తప్పు చెయ్యలేదు.. చెయ్యనివ్వను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. యాభై రెండు రోజుల పాటు నేను జైల్లో ఉన్నానని.. నాకోసం ప్రజలు ఇన్ని రోజుల పాటు నిరసనలను చేపట్టారని.. ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి అనుభవం ఉండదని.. ఇటువంటి అదృష్టం ఉండదని అన్నారు. జైల్లో ఉండడం అదృష్టమా? అంటూ ప్రజలు ఆయన మాటలు విన్నాక అనుకుంటున్నారు. ఇక తనకు మద్దతు ఇచ్చినందుకు కెసిఆర్ కు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటినుంచో బాబు, పవన్ కళ్యాణ్ ఒకటేనని అందరికి తెలిసినదే కదా.. మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది అంటూ కొందరు భావిస్తున్నారు. మొత్తానికి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడడాన్ని మాత్రం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి రంగరాజు ఖండిస్తున్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయన బెయిల్ రద్దు చెయ్యాలి అంటూ ఆయన డిమాండ్ చేసారు.
మరిన్ని..
రాజమౌళిని రిజెక్ట్ చేసిన 12 నటీనటులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!