Advertisement
రాజకీయ నాయకులు అంటే బాగా డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు అన్న భావన చాలా మంది ప్రజలలో నెలకొని ఉంది. రాజకీయాల్లో గెలిచే సమయానికి వారి వద్ద డబ్బు లేకున్నా.. రాజకీయాల్లో పదవి వచ్చాక బాగానే సంపాదించుకుంటారు అన్న అపోహలు కూడా చాలా మందికి ఉంటాయి. కానీ వీటన్నిటికీ విరుద్ధమైన ఈ వ్యక్తి పేరు గుర్రం యాదగిరి రెడ్డి. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన రామన్న పేటకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేసారు.
Advertisement
2019 లో నవంబర్ 22 న గుండెపోటు రావడంతో ఈయన మరణించారు. కానీ, ఇప్పటికీ అక్కడి ప్రజలు ఈయన గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా.. హైద్రాబాదులో ఆయనకు కనీసం సొంత ఇల్లు లేదు. బతికినంత కాలం కుమారుల ఇంట్లోనే ఆయన ఉన్నారు. స్వగ్రామం అయిన సుద్దాలలో ఓ పెంకుటిల్లు మాత్రం ఉండేది. ఇంకా మూడు ఎకరాలు పొలం ఉండేది. ఇవి కూడా ఆయన పెద్దల నుంచి ఆయనకీ వారసత్వంగా వచ్చిన ఆస్తే. ఆయనకు సొంతంగా కారు లాంటి వాహనాలు కూడా ఏమీ లేవు. ఒక సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణాలు చేసేవారు.
Advertisement
తానూ ఎమ్మెల్యే గా పని చేసిన ప్రజల కష్టాలను తీర్చి ఆయన ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా ఓ సామాన్య వ్యక్తిగా గడపడం ఆయనకు మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని అనుసరించారు. తెలంగాణ సాయుధ పోరులో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే.. గెరిల్లా దళంలో పని చేసినందువలన ఆయనకు కనీసం పింఛన్ కూడా రాలేదు. 14వ ఏటనే గెరిల్లా దళానికి ఆర్గనైజర్ అయిన యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా తన నియోజక వర్గ ప్రజల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసారు. ఎమ్మెల్యే కాకముందు ఆయన రైతు సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా పని చేసారు.
మరిన్ని..
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను .. సూర్య 2009 లోనే తన సినిమాలో చూపించేసాడా? ఆ సినిమా ఏదంటే?
పవన్ కళ్యాణ్ ఇటలీ వెళ్ళింది ఇందుకా ? ఆ నెటిజెన్ పెట్టిన పోస్ట్ చూస్తే నవ్వు ఆగదు !
రూల్స్ ని బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు.. బెయిల్ రద్దు చెయ్యాలి అంటూ..?