Advertisement
Vidhi Telugu Review: తెలుగు క్రై!మ్ థ్రిల్లర్ గా ఈరోజు విడుదల అయిన సినిమా విధి. ఆర్థిక పోరాటాలు మరియు అన్యాయానికి గురైన అమాయక యువకుడైన సూర్య అనే వ్యక్తి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన అనుభూతికి లోను చేస్తుంది.
Advertisement
ఈ సినిమా అంత ఒక మిస్టరీని ఛేదించడం చుట్టూ తిరుగుతుంది. అనేక ట్విస్ట్ లు, ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందీ సినిమా. కుట్ర, ప్రతీకారం మరియు న్యాయం మరియు ప్రతీకారం మధ్య ఎదురయ్యే అనేక ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా.
రోహిత్ నందా సూర్య పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. సినిమాలు తాను ఎదుర్కొన్న ఆర్ధిక సమస్యలు, అన్యాయాన్ని ఎదుర్కొనే యువకుడి పాత్రలో రోహిత్ జీవించేసాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఆనంది పాత్ర కూడా బాగుంటుంది. మిగతా తారాగణం తమ పరిధిమేరకు నటించారు. దర్శకులు శ్రీకాంత్ రంగనాథన్ మరియు శ్రీనాథ్ రంగనాథన్ కథాంశాన్ని నైపుణ్యంగా నావిగేట్ చేసారు. సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కథలోకి వెళ్తే.. మధ్యతరగతి యువకుడైన సూర్య ఆర్ధిక ఇక్కట్లతో పాటు అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. అనుకోకుండ ఓ ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. ఓ పెన్ చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరకి ఆ రహస్యాన్ని ఎలా కనుక్కున్నాడు అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Advertisement
ఫేట్ లేదా డెస్టినీ ని జస్టిఫై చేయడం కోసమే ఈ సినిమాకి “విధి” అని పేరు పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య “విధి” ఆడే ఆటలో పావు అయ్యాడా? లేక డెస్టినీని ఎదుర్కొన్నాడా అనేది సినిమాలో చూడాల్సిందే. సస్పెన్స్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు సౌండ్ ట్రాక్ కూడా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ సినిమాని థియేటర్ లో చూస్తే ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు.
మరిన్ని..