Advertisement
తాజాగా తమిళ నాడులో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ జంటని దారుణంగా హ*త్య* చేసారు. పెళ్ళైన మూడు రోజులకే ఇలా చేయడం మరింత దారుణం. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే, తమిళనాడు కు చెందిన వీరిద్దరి పేర్లు మారిసెల్వం, కార్తీక. వీరిద్దరూ గత రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు బాగానే అర్ధం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరి పెళ్ళికి పెద్దలు అంగీకారం తెలపలేదు.
Advertisement
యువతీ కార్తీక కూడా తన తల్లితండ్రులను ఒప్పించాలని చాలా ప్రయత్నించింది. అయితే.. వారు ఒప్పుకోకపోవడంతో జరిగినదంతా తన ప్రియుడికి తెలిపింది. ఇక వారు చేసేది లేక వారిద్దరే వెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కార్తీక తల్లితండ్రులకు తెలియడంతో వారు ఆగ్రహించారు. కూతురుపైనా, అల్లుడిపైనా చాలా కోపం పెంచుకున్నారు.
Advertisement
పెళ్లి జరిగిన మూడు రోజులకే సెల్వం, కార్తీక దారుణ హ!త్యకి గురయ్యారు. వీరి శవాలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్వం, కార్తికల శవాలను స్వాధీనం చేసుకున్నారు. యువతీ ఒంటిపై పన్నెండు కత్తి పోట్లు ఉంటె.. యువకుడి ఒంటిపై ఇరవై కత్తి పోట్లు ఉన్నాయి. కుమార్తెపై కోపంతో యువతీ తల్లితండ్రులు ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని..
స్కంద సినిమాలో ఈ బ్లండర్ మిస్టేక్ ని గమనించారా? బోయపాటిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్..!
‘మా ఊరి పొలిమేర’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా? ఇంతకుముందు ఏ సినిమాలో చూసాం అంటే?
చిరంజీవి గురించి ఆ సినిమాలో అప్పుడు లావణ్య చెప్పిన మాటే నిజమయ్యిందిగా.. అదేంటంటే?