Advertisement
క్యారక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో మురళి శర్మ ఒకరు. నిన్ను కోరి, అల వైకుంఠపురం లో, భలే భలే మగాడివోయ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఖాతాలో చాలా హిట్లే ఉన్నాయి. గతంలో ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించిన మురళి శర్మ ప్రస్తుతం తెలుగు సినిమాలతోనే బిజీ అయ్యారు. వెండితెరపై విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మురళి శర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే.. ఆయన భార్య కూడా పరిచయం అవసరం లేని వ్యక్తే. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటే. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మురళి శర్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించిన మురళీశర్మ ప్రస్తుతం ఎక్కువగా తండ్రి పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇండస్ట్రీలో రావు రమేష్ లాంటి నటులకు ఆయన గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పవచ్చు. ఆయన చాలా పాపులర్ వ్యక్తి అయినప్పటికీ ఆయన భార్య, పిల్లలు ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు. ఆయన భార్య కూడా పాపులర్ నటి. ఆమె పేరు అశ్విని కాలశేఖర్. ఆమె హిందీ నటి. హిందీలో చాలా సీరియల్స్ లో ఆమె నటించారు.
Advertisement
సిఐడి సీరియల్ తో ఆమె తెలుగు వారికి కూడా పరిచయం అయ్యారు. ఆమె పేరు చెప్తే గుర్తుపట్టటకపోవచ్చు. కానీ బద్రీనాధ్ లో ఓ డైలాగ్ ఉంటుంది. “నేనెవరో తెలుసా.. నీ మేనత్తని.. సర్కార్ భార్యని.. ఒక్కసారి అత్తా అని పిలవ్వే..” అని వచ్చే ఈ డైలాగ్ చెప్పింది ఎవరో గుర్తుందా? తమన్నా మేనత్త పాత్రలో నటించి అలరించిన అశ్విని, మురళీశర్మకు భార్య. చివరగా మెహబూబా సినిమాలో కనిపించిన అశ్విని ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Read More:
ఆరు పదుల వయసులో ఒక్కటయ్యారు… అందరు ఇలానే ఆలోచిస్తే బాగుంటుందేమో..!
అయ్యప్ప మాల వేసుకున్న వారు నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు? అసలు కారణం ఏంటంటే?
ప్రియుడిని ఇంటికి పిలిచింది.. దొరికిపోయేసరికి ప్లేట్ మార్చి, చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత?