Advertisement
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు వారిద్దరి మధ్య అస్సలు ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఒకరిపట్ల మరొకరు నిజాయితీగా ఉంటె వారి బంధం చిరకాలం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నా సరే అమ్మాయిలు కొన్ని ప్రశ్నలను కచ్చితంగా అబ్బాయిలను ముందే అడిగి తెలుసుకోవాలి. ఆ ప్రశ్నలు ఏమిటో ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.
Advertisement
మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?ఒక అబ్బాయి ఫ్యూచర్ ప్లాన్ ఏంటో అడిగి తెలుసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తారు. ఆ అబ్బాయి ఆ ప్రశ్నకి ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న సందేహంలో ఉంటారు. కానీ, కచ్చితంగా ఈ ప్రశ్న అడగాలి. ఈ ప్రశ్నకి ధీటుగా సమాధానం చెప్పే అబ్బాయిల కంటే పారిపోయే వారు ఎక్కువ అని చెప్పచ్చు. కానీ, ఒకరి లైఫ్ లోకి వెళ్లే ముందు వారి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం.
నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
ఒక అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. కచ్చితంగా అతను మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీనివలన ఒకరి మనసులో ఏముందో మరొకరు తెలుసుకోగలుగుతారు.
రిలేషన్ షిప్ గురించి అభిప్రాయాలు ఏమిటి?
మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ పై అభిప్రాయం కూడా అవసరమే. అది తెలుసుకోవడం వలన ఏమైనా లోటుపాట్లుంటే సరి చేసుకోవచ్చు.
Advertisement
ఇంటిపనుల్లో నీ పాత్ర ఏంటి?
ఇంటి పనులు అనేవి కేవలం అమ్మాయిలకి మాత్రమే పరిమితం కాదు. అవి బేసిక్ పనులు. బతకడానికి అమ్మాయికి అయినా.. అబ్బాయికి అయినా కావాల్సినవి. నేటి పోటీ ప్రపంచంలో అమ్మాయిలు కూడా ఉద్యోగం చేస్తేనే గడవని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో అబ్బాయిలు కూడా ఇంటిపనుల్లో సాయం అందించాలి.
కష్టాలను ఎలా ఎదుర్కొంటావు?
కష్టాలనేవి ఎవ్వరికైనా వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొంటాం అన్న విషయం పైనే ఒక వ్యక్తి ధైర్యం స్థాయిలు తెలుస్తాయి. అందుకే.. ఈ విషయంలో అబ్బాయిల అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
డబ్బు పైన నీ అభిప్రాయం ఏంటి?
దంపతుల మధ్య ఎక్కువ గొడవలు రావడానికి కారణం డబ్బు. ఇది చాలా సున్నితమైన అంశం. డబ్బు ప్రస్తావన తీసుకొస్తే గొడవ అవుతుంది అనుకుంటే.. అటువంటి రిలేషన్ అర్ధం లేనిదే. ఆర్ధిక పరమైన విషయాలు ఇద్దరు కలిసి కూర్చుని చర్చించుకునే హక్కు ఇద్దరికీ ఉంటుంది. ఆ పారదర్శకతను ముందునుంచి బిల్డ్ చేసుకోవాలి. అందుకే ఈ ప్రశ్నని కూడా అమ్మాయిలు కచ్చితంగా ముందే అడగాలి.
Read More:
ఆ ఫేమస్ నటి మురళి శర్మ భార్య అని తెలుసా? ఒక్క డైలాగ్ తోనే ఫేమస్ అయిన ఈ నటి ఎవరంటే?
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే ఊహించని ట్విస్ట్ లు.. ఏమి జరిగిందంటే?
ఆరు పదుల వయసులో ఒక్కటయ్యారు… అందరు ఇలానే ఆలోచిస్తే బాగుంటుందేమో..!