Advertisement
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికల్లో అయినా ఈయన బరిలోకి దిగుతూనే ఉంటారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా.. చివరకు రాష్ట్రపతి ఎన్నికలు అయినా ఈయన వెనకడుగు వెయ్యకుండా పోటీ చేస్తూ ఉంటారు. ఈయన పేరు పద్మరాజన్. ఈయన ఓ హోమియోపతి వైద్యుడు. ఈయన తమిళ వ్యక్తి. దేశ రాజకీయాలపై అవగాహనా ఉన్న వారికి ఈయన ఎవరో తెలిసే ఉంటుంది. సామాన్య ప్రజలకు ఈయన తెలిసే అవకాశం తక్కువ. అయితే.. ప్రస్తుతం ఈయన కేసీఆర్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.
Advertisement
ఈయన ఎక్కువ సార్లు పోటీ చేసిన మరియు ఎక్కువ సార్లు ఓడిపోయినా వ్యక్తిగా రెకార్డులలోకి ఎక్కారు. 1986లో సొంత నియోజకవర్గం మెట్టూరు లో ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డ పద్మరాజన్ అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. వార్డు మెంబర్ నుంచి.. రాష్ట్రపతి ఎన్నికల వరకూ అన్నిటిలోనూ ఈయన పోటీ చేస్తారు. ఈయన ఇప్పటివరకు 32 లోక్సభ, 50 రాజ్యసభ, 72 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. అంతే కాకుండా 5 రాష్ట్రపతి ఎన్నికలు, 5 ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మూడు సార్లు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసారు.
Advertisement
ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకోకుండా పోటీ చేసే పద్మరాజన్ ప్రస్తుతం కేసీఆర్ కు వ్యతిరేకంగా 237 వ సారి నామినేషన్ వేశారు. 1986 నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపు ఇరవై లక్షల రూపాయలను ఖర్చు చేశారట. గతంలో ఓ సారి ఆయన పివి నరసింహారావు కు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఆయనపై దాడి కూడా జరిగిందట. ఆయన వెనుకడుగు వెయ్యకుండా పోటీ చేశారట. పళనిస్వామి, యడ్యూరప్ప, స్టాలిన్, కరుణానిధి, జయలలిత, ఎస్ఎం కృష్ణ లకు వ్యతిరేకంగా కూడా ఆయన పోటీ చేశారట. ఇంకా 2019 ఎన్నికల్లో రాహుల్ కి వ్యతిరేకంగా కూడా ఆయన పోటీ చేశారట. ఆయన నామినేషన్ దాఖలు చేయడానికే ఖర్చు పెట్టారు తప్ప ఈరోజు ఎన్నికల కోసం ప్రచారం కోసం ఖర్చు చేయలేదట. అందుకే ఆయనను అందరు ముద్దుగా ఎలక్షన్ కింగ్ అని పిలుచుకుంటారట.
Read More:
క్రికెట్ ఫీల్డ్ లో ” టైమ్డ్ ఔట్” అంటే అర్ధం ఇదేనా? భారత్ లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?
రామ్ గోపాల్ వర్మకు చంద్రబాబు నాయుడు నచ్చకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? అసలు విషయం ఇదే!