Advertisement
Mangalavaram Review: ఆర్ ఎక్స్ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ దర్శకుడు అయిపోయిన అజయ్ భూపతి తన రెండవ సినిమాగా “మహా సముద్రం” లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకున్నారు. స్కేల్ పరంగా ఇది పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ.. ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఇప్పుడు “మంగళవారం” అనే కొత్త కాన్సెప్ట్ తో అజయ్ భూపతి వస్తున్నాడు. పాన్-సౌత్ ఇండియన్ మూవీ, నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.
Advertisement
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. ‘కాంతారావు’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, తాజా ముఖాలు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ అయిన ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతి గునుపాటి మరియు సురేష్ వర్మ ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు, అజయ్ భూపతి కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Advertisement
కాస్ట్ అండ్ క్రూ :
- నటి: పాయల్ రాజ్‌పుత్
- దర్శకుడు: అజయ్ భూపతి
- సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
- నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఎమ్
- విడుదల తేదీ : 17 నవంబర్ 2023
భాష: తెలుగు - రన్ టైమ్: 2గం 20 నిమిషాలు
- జానర్: యాక్షన్, డ్రామా
నవంబర్ 17 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు చాలానే కట్స్ చెప్పారట. ఆ సీన్స్ కట్ చేయకుంటే యు/ఎ ఇవ్వలేమని చెప్పారట. యు/ఎ రాకపోయినా పర్లేదని, కట్స్ మాత్రం వద్దని సినిమా యూనిట్ రిక్వెస్ట్ చేశారట. దీనితో సెన్సార్ వారు ఈ సినిమాకు క్లీన్ A సర్టిఫికెట్ ఇచ్చారట. ఈ సినిమాకు పాయల్ రాజ్ పుత్ నటనతో పాటు అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ పాయింట్ అవుతాయట. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందని, బి..సి.. సెంటర్స్ లలో ఈ సినిమా బాగా ఆడుతుందని అంటున్నారు.