Advertisement
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్తని చెప్పింది. తిరుమల స్వామి వారి ఆశీస్సులు వారందరికీ ఎల్లప్పుడూ ఉండేలా టీటీడీ ఓ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలు వారి పెళ్లి శుభలేఖను అడ్రస్ తో సహా టీటీడీకి పంపిస్తే.. వారికి ఉచితంగా తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం తో పాటు స్వామి వారి ప్రసాదాన్ని కూడా టీటీడీ అందిస్తుంది. ఈ విధానం గతంలో కూడా ఉండేది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా టీటీడీ ఈ విధానాలను తాత్కాలికంగా ఆపేసింది.
Advertisement
తాజాగా.. తిరిగి ఈ ప్రసాదాలను పోస్ట్ లలో పంపించే ఏర్పాట్లు చేయబోతున్నట్లు టీటీడీ పేర్కొంది. అయితే.. ఇందుకోసం కొత్తగా పెళ్లి చేసుకున్న జంట “శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ.ఓ ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కే.టి రోడ్, తిరుపతి 517501” అడ్రస్ కు వారి శుభలేఖలు పంపాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే లేఖ పంపిస్తున్నారో వారి అడ్రెస్ వివరాలను కూడా తెలపాల్సి ఉంటుంది.
Advertisement
పెళ్లిలో తొలిఘట్టంగా కంకణ ధారణ చేస్తారు. ఉపద్రవాల నుంచి రక్షణ కల్పించడం కోసమే ఈ కంకణ ధారణ చేస్తారు. అందుకే టీటీడీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా పసుపు కుంకుమలను, కంకణాన్ని పంపిస్తారు. అలాగే కొత్త దంపతులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ స్వామి వారి తలంబ్రాలను కూడా టీటీడీ పంపిస్తోంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే టీటీడీ ని సంప్రదించవచ్చు.
Read More:
క్రికెట్ లవర్స్ కి పెద్ద బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి మీరు ఆ వీడియోలు చూడలేరట!