Advertisement
తెలంగాణాలో ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు నామినేషన్ల హడావిడి కనిపిస్తోంది. మరో వైపు నాయకులు, నేతల బహిరంగ ప్రచారాలు, సభలతో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే.. ప్రజలు కూడా వారి సమావేశాల కంటే ఈ సారి ఏ నేతకు ఓటు వెయ్యాలి అనే విషయమై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరికీ ఎన్ని ఆస్తులు ఉన్నాయి.. ఈ ఐదేళ్ళలో ఎవరెంత సంపాదించుకున్నారు..? మా ప్రాంతం ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత? అన్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా. కేసీఆర్ అఫిడవిట్ లో ఏమేమి వివరాలు ఉన్నాయి అన్న సంగతి వైరల్ అవుతోంది.
Advertisement
ఎన్నికల వేళ బహిరంగ సభలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. “నేను కూడా రైతునే.. ఈరోజుకి వ్యవసాయం చేస్తూనే ఉంటా.. ఎన్నికల్లో ఓడిపోతే.. వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా..” అంటూ కేసీఆర్ తన ప్రచారాల్లోని ప్రసంగాల్లో చెబుతున్నారు. నేను పెద్ద కాపుని అని చెప్పుకునే కేసీఆర్ కు కనీసం కారు కూడా లేదట. ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ స్వయంగా తెలిపిన ఈ వివరాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం.
Advertisement
వ్యవసాయాన్ని తన వృత్తిగా చెప్పుకునే కేసీఆర్ కు కనీసం గుంట భూమి కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయనకు ఆస్తులు లేవని అనుకుంటే పొరపాటే. ఆయన పేరుపై ఆస్తులు లేకున్నా.. వారికి ఉన్న స్థలాలన్నీ కుటుంబం ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయట. ఈ కుటుంబ ఆస్తులలో 53.30 ఎకరాల సాగుభూములు 9.36 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే శివారు వెంకటాపురం గ్రామం వద్ద పది ఎకరాల పొలాన్ని కేసీఆర్ కుటుంబం కొనుగోలు చేసిందట. ఈ భూమి విలువ దాదాపు రూ. 28.47 లక్షలు ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇవి కాకుండా కెసిఆర్ కు రూ. 17.83 కోట్ల రూపాయల స్థిరాస్తులు,, రూ. 9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయట. కెసిఆర్ పేరు మీద రూ. 17.27 కోట్ల అప్పు ఉంది. ఇక ఆయన కుటుంబం పేరిట 7.23 కోట్ల రూపాయల అప్పు ఉందట. 2018 ఎన్నికల సమయానికి కేసీఆర్ పేరు మీద బ్యాంకులో రూ. 5.63 కోట్లు డిపాజిట్ ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తం రూ. 11.16 కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పుడు కేసీఆర్ చేతిలో 2 లక్షల 96 వేలు ఉన్నాయట. ఆయన భార్య వద్ద 2018 టైం లో రూ.94 వేల మేర ఉంటె, ఇప్పుడు రూ. 6.29 కోట్ల రూపాయలు ఉంది. ద్విచక్ర వాహనాలు, కార్స్ లేకున్నా వ్యవసాయం కోసం ఉపయోగించే జెసిబి, హార్వెస్టర్, ట్రాక్టర్ లాంటి వాహనాలు ఉన్నాయట.
Read More:
షమీ లైఫ్ లోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ లో షమీ తలరాత మార్చేసిందిగా!
ఆ పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారా? ఏ సినిమాలో అంటే?
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్