Advertisement
భార్యాభర్తల భాగస్వామ్య ఆరోగ్యం ఎక్కువగా భార్యాభర్తల ప్రేమ అనురాగంపై ఆధార పడి ఉంటుంది. వారిద్దరి మధ్య సఖ్యత కుదిరి, అన్యోన్యంగా ఉంటేనే వారిద్దరి మధ్య రిలేషన్ ఆరోగ్యంగా ఉన్నట్లు అర్ధం. భార్య భర్తల మధ్య ఉన్న సఖ్యతని, ప్రేమని వ్యక్తీకరించే విధంగా ఉండే కొన్ని కోట్స్ ను మేము ఇక్కడ పంచుకుంటున్నాము. వాటిని మీ లవర్ లేదా భాగస్వామికి పంచుకుని.. వారి పట్ల మీకు ఉన్న ప్రేమని తెలియపరచండి.
Advertisement
- “అందలం ఎక్కించాలి అని ఏ భార్యా కోరుకోదు.. కానీ అందరిలో చులకన చెయ్యకూడదు అని మాత్రం కోరుకుంటుంది”
- “నా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా.. భార్యకి భర్తే భగవంతుడు. ఎంత మంది మిమ్మల్ని మోసం చేసినా.. మిమ్మల్నే నమ్ముకుని ఉండేది మీ భార్య ఒక్కటే”
- “జీవితంలో కష్టాలు సుఖాలు ఎన్ని ఉన్నా.. వస్తూ పోతూనే ఉంటాయి. కానీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ భార్య మాత్రం జీవితాంతం మీతోనే ఉంటుంది”
- “నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం ఇవ్వలేదు. పోనీలే.. కనీసం జ్ఞాపకాలను అయినా ఇచ్చావు. వాటితోనే జీవితాన్ని గడిపేస్తాను.”
- “నాది ప్రేమించే హృదయం. నువ్వు ఎంత గాయాపరిచినా అది గాయపడదు. తిరిగి ప్రేమని మాత్రమే అందిస్తూ ఉంటుంది”
- “ప్రతి భర్త తన భార్యని తల్లిగా భావిస్తూ ఉంటె.. భార్య మాత్రం తన భర్తని మొదటి బిడ్డగా భావిస్తుంది.”
- “నువ్వు మాట్లాడితే వినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు.. నీ కళ్ళల్లో నేను మాయం అయిపోయాను.”
- “ప్రేమలో ఒక్కసారే పడతాం అని అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే.. నేను నిన్ను చూసిన ప్రతి సారీ ప్రేమలో పడుతున్నాను.”
- “ప్రేమని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అది కళ్ళలో కనిపిస్తుంది. మనం చేసే పనుల్లో కనిపిస్తూ ఉంటుంది.”
- “ఒక అమ్మాయి ఎంత గొప్పగా పెరిగినా.. ఆమె అదృష్టం, దురదృష్టం తెలిసేది ఆమె పెళ్లి తరువాతే..”
Advertisement
Read More:
షమీ లైఫ్ లోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ లో షమీ తలరాత మార్చేసిందిగా!
ఆ పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారా? ఏ సినిమాలో అంటే?
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్