Advertisement
పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో అయినా.. అబ్బాయి జీవితంలో అయినా ఓ మరపురాని ఘట్టం. ఈ పెళ్లి తోనే వారి జీవితంలో కొత్త మలుపు మొదలవుతుంది. అయితే.. కొత్త ఆశలతో వారు తమ జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితానికి తెర లేపుతారు. అయితే.. అనుకోకుండా కొందరి వైవాహిక జీవితాల్లో విషాదం మొలుస్తుంది. ఇద్దరి మధ్య తెలియని దూరం మొదలవుతూ ఉంటుంది. ఫలితంగా వివాహేతర సంబంధాలు పుట్టుకుంటూ వస్తాయి. సరైన సమయంలో స్పందించి వైవాహిక జీవితంలో జరుగుతున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే.. వివాహేతర సంబంధాలను ఏర్పరచుకోకుండా అడ్డుకోవచ్చు. అసలు ఇలాంటి సంబంధాల జోలికి వెళ్ళడానికి ముఖ్య కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
పెళ్లి చేసుకున్న తరువాత కొంత కాలానికి ఆ జంటలో విసుగు వస్తూ ఉండడం వివాహేతర సంబంధాలకు మొదటి కారణం అవుతుంది. విసుగు ఎక్కువ అవుతున్న కొద్దీ.. వారు మరో వ్యక్తికీ అట్రాక్ట్ అవుతూ.. ఇతరులను ఇష్టపడతారు. మరో కారణం ఏంటంటే.. అసలు పెళ్లి ఇష్టం లేకపోవడం. పెద్దల ఒత్తిడితో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వారు త్వరగా ఆ రిలేషన్ నుంచి బయటపడాలని అనుకుంటారు. అందుకే వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతారు.
Advertisement
ఏ రిలేషన్ లో అయినా కామన్ గా గొడవలు వస్తూ ఉంటాయి. కొంతమంది వాటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు ఏమో వాటిని భూతద్దంలో పెట్టి చూసి తమకు సరైన వారు కాదు అని నిర్ణయం తీసేసుకుంటూ ఉంటారు. అందుకే వారు మరొకరిని వెతుక్కుంటూ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. పెళ్లయ్యాక కొందరికి ఆ రిలేషన్ బోర్ గా అనిపిస్తూ ఉంటుంది. అప్పటివరకు తమ జీవితంలో ఉన్నవారు నచ్చకపోవడంతోనే మరొకరి కోసం వెతుకుతుంటారు. సంసారం జీవితం మొదలయ్యాక కొన్నిసార్లు త్యాగాలు కూడా చెయ్యాల్సి వస్తూ ఉంటుంది. ఈ త్యాగాల వలన విసుగు వస్తే.. వారు ఇంకొకరిని చూసుకుని వివాహేతర సంబంధాలను ఏర్పరుచుకుంటూ ఉంటారు.
Read More:
షమీ లైఫ్ లోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ లో షమీ తలరాత మార్చేసిందిగా!
ఆ పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారా? ఏ సినిమాలో అంటే?
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్