Advertisement
ఏ తల్లి తండ్రులైనా తమ పిల్లలతో కలిసి తినడం, పడుకోవడం చాలా కామన్ గా జరుగుతుంది. ఒక వయసు వచ్చేవరకు పిల్లలు ఎక్కువ సమయం తల్లితండ్రులతోనే గడుపుతారు. అయితే.. స్కూల్ కు వెళ్లే ముందు వరకు రోజంతా తల్లితండ్రులతో ఎవరో ఒకరితో కలిసే ఉంటారు. దూరంగా ఉండడం చాలా తక్కువ. ఈ క్రమంలో తల్లి తండ్రులు కూడా వారి సొంత పనులను పిల్లల ముందే చేసుకుంటూ ఉంటారు. కొందరు, పిల్లల ముందు తమ బట్టలను కూడా మార్చుకుంటూ ఉంటారు. పిల్లల ముందు మీరు నగ్నంగా ఉన్నా వారు గమనిస్తూనే ఉంటారు.
Advertisement
ఆ సమయంలో వారు చాలా నార్మల్ గా ఉంటారు. కానీ, వారికి ఇది ఇలానే కొనసాగితే తరువాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళ ముందు నగ్నంగా ఉన్నా తప్పేమీ లేదు అని మనం ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అవుతుంది. ఇంకా కొంత మంది హాలు లో అందరిముందే క్రీం రాయడం, వారికి బట్టలు వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అది కూడా వారిలో అందరి ముందు బట్టలు మార్చుకోవడం తప్పు కాదు అన్న సంకేతాలను పంపిస్తూ ఉంటుంది.
Advertisement
కొందరైతే పిల్లలతోనే కలిసి స్నానం చేస్తారు. మరికొందరు వారికి స్నానం చేసి పంపాక.. తాము స్నానం చేసి వస్తారు. ఈ అంశాలపై పిల్లలలో అనేక డౌట్స్ కలగడం కూడా సహజం. ఆ సమయంలో వారికి సరిగ్గా అర్ధం అయ్యేలా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి, చెడు గురించి వివరించి చెప్పాలి. ఇతరుల ముందు ఎలా ఉండాలి అన్న విషయాలను కూడా చెప్పాలి. బాడీ పార్ట్శ్ గురించి, వాటి ఉపయోగాల గురించి మాత్రమే చెప్పడం కాకుండా.. గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి వివరించి చెప్పాలి.
Read More:
వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఇలా ఎందుకు చేస్తారంటే?
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆస్తుల విలువ ! కారు లేదు, సేంట్ భూమి కూడా !
షమీ లైఫ్ లోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ లో షమీ తలరాత మార్చేసిందిగా!