Advertisement
చిన్న వయసులోనే స్టార్ హీరో గా ఎదిగిన ఉదయ్ కిరణ్.. పైకొచ్చినంత తొందరగానే పైకెళ్లిపోయాడు. ఆయుష్షు ఉండగానే బలవంతంగా ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే.. ఆయనని మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలలో మోగుతూనే ఉంటాయి. ‘మనసంతా నువ్వే’, ‘చిత్రం’ ‘నువ్వు నేను’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా దూసుకొచ్చిన ఉదయ్ కిరణ్ అప్పటి స్టార్ హీరోలకు తలదన్నే పోటీ ఇచ్చాడు.
Advertisement
అయితే.. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం ఆగిపోవడంతో తెరమరుగయ్యారు. అయితే.. ఒక దశలో మెగాస్టార్ చిరంజీవి తన కూతురుని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి వివాహం చేయాలనీ కూడా అనుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అనుకోని కారణాల వలన ఈ వివాహం ఆగిపోయింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్ విషితనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరో వైపు అవకాశాలు కూడా తగ్గుతుండడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని, అదే అతన్ని బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా చేసిందని చెబుతుంటారు.
Advertisement
అయితే.. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఉదయ్ కిరణ్ దృష్టి సావాసాల వైపు మళ్లిందట. ఆ టైం లోనే ఆయన కెరీర్ డౌన్ అయ్యిందట. ఒకానొక టైం లో హీరోయిన్ అనిత ఉదయ్ కిరణ్ కు ప్రపోజ్ కూడా చేసిందట. వారిద్దరూ సీక్రెట్ గా ప్రేమించుకున్నారట. అయితే.. వారి లవ్ సక్సెస్ అయ్యి.. పెళ్లి చేసుకుని ఉండి ఉంటె ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్యే హ్యాపీ గా ఉండేవాడు. కెరీర్ డౌన్ అయినా.. అనాలోచిత నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటె ఆయన కెరీర్ అద్భుతంగా ఉండేది అంటూ ఆయన ఫాన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. హీరోయిన్ అనిత, ఉదయ్ కిరణ్ కలిసి మనసంతా నువ్వే సినిమాలో కలిసి నటించారన్న సంగతి తెలిసిందే.
Read More:
పిల్లల ముందే బట్టలు చేంజ్ చేసుకోవడం లాంటి పనులు చేస్తున్నారా? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి!
వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఇలా ఎందుకు చేస్తారంటే?