Advertisement
ఒక సినిమా తీయాలంటే దాని కాన్సెప్ట్ కు తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. చివరకు చాలా కష్టపడి కంటెంట్ ను ప్రేక్షకుడికి అర్ధం అయ్యే విధంగా చెప్పడం కోసం చాలానే కష్టపడతారు. అయితే.. ఈ క్రమంలో జరిగే కొన్ని పొరపాట్ల వలన ఒక సినిమాకు లీగల్ గా కూడా ఇబ్బందులు వస్తాయి. దానివలన సినిమాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను, పాటలను తొలగించాల్సి వస్తుంది. ఏ ఏ సినిమాలకు ఇలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
అంకురం:
1992 లో విడుదల అయినా ఈ సినిమాకు చాలానే కలెక్షన్స్ వచ్చాయి. ఆ సంవత్సరం ఉత్తమ నంది అవార్డుని కూడా ఈ సినిమా అందుకోవాల్సి ఉంది. కానీ పోలీస్ ఉన్నతాధికారులు దాన్ని అడ్డుకున్నారు. పోలీస్ వ్యవస్థకి సంబంధించిన ఈ సినిమా వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపిస్తుందని.. అటువంటి సినిమాకు అవార్డు ఇస్తే పోలిసుల గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుంది అని వారు లేఖ రాసారు. దీనితో ఈ సినిమాకు ఆ అవార్డు రాలేదు.
జయం:
Advertisement
నితిన్, సదా జంటగా నటించిన సినిమా జయం. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు బాగానే ఉంది. మంచి కలెక్షన్స్ ని కూడా తీసుకొచ్చింది. అయితే.. ఆ తరువాత ఈ సినిమాను టివిలో వేసేటప్పుడు మాత్రం రైలుబండి పాటని కట్ చేసి వేశారు. దానికి కారణం రైల్వే శాఖ. ఈ పాటలో ఓ చోట “బండి బండి రైలు బండి అది వేలకంటూ రాదు .. దాన్ని నమ్ముకుంటే అంతే.. ” అంటూ కొన్ని లైన్స్ ఉంటాయి. అవి రైల్వే శాఖ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడంతో తొలగించాల్సి వచ్చింది.
రాపిడో యాడ్:
ఈ ఘటన రీసెంట్ గానే జరిగింది. ఈ రాపిడో కు అల్లు అర్జున్ ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. సాధారణ బస్ అంటే ఏదో దోస టైపు లో చాలా టైం తీసుకుంటారని.. టైం సేవ్ అవ్వాలంటే రాపిడో వాడాలని ఈ యాడ్ లో చెప్తారు. దీనిపై ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. అయితే.. దీని వలన హర్ట్ అయిన ఆర్టీసీ లీగల్ నోటీసులు విడుదల చేయడం వలన ఆ యాడ్ మళ్ళీ కనిపించలేదు.
Read More:
ఉదయకిరణ్ చేసిన పెద్ద పొరపాటు, ఆ రోజు అలా చేసిఉంటే బ్రతికుండేవాడా ?
టీమిండియా పేసర్ల సక్సెస్ వెనుక ఉన్న ఈ కోచ్ ఎవరో తెలుసా? ఆడింది ఐదు మ్యాచ్ లే అయినా?
పిల్లల ముందే బట్టలు చేంజ్ చేసుకోవడం లాంటి పనులు చేస్తున్నారా? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి!