Advertisement
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఓ దుర్మార్గుడు దీపావళి రోజు తిరిగిరాని లోకాలకి పంపేశాడు. అద్దె ఇల్లు మారడంతో పాటు కొన్ని ఇతర పనులకు అడ్డు చెబుతోంది అన్న కారణంతో ఆ దుర్మార్గుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, వరంగల్ జిల్లా గన్నారంకు చెందిన స్రవంతి, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరిపల్లికి చెందిన మహేందర్ లు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ 2019 లో పెళ్లి చేసుకున్నారు.
Advertisement
మహేందర్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే అతను జైలుకి వెళ్లి వచ్చాడు. అతన్ని బెయిల్ పై బయటకు తీసుకురావడానికి స్రవంతినే కష్టపడింది. అందుకు కొంత డబ్బు కూడా ఖర్చు చేసింది. బెయిల్ పై బయటకు వచ్చాక ఉప్పల్ నుంచి నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఉన్న సమతా నగర్ కు మారారు. ఈ బెయిల్ కోసం డబ్బు ఖర్చు అవ్వడంతో.. ఆ డబ్బు విషయమై ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి. ఆర్ధిక సమస్యలు ఒకెత్తయితే.. మహేందర్ ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో గొడవలు ముదిరాయి.
Advertisement
దీనితో స్రవంతి గత కొంతకాలంగా తన తల్లి ఇంటివద్దే ఉంటోంది. దీపావళి ముందు రోజు శనివారం రాత్రి స్రవంతికి ఫోన్ చేసి ఇల్లు ఖాళి చేస్తున్నట్లు చెప్పాడు. అందుకు స్రవంతి ఒప్పుకోలేదు. వెంటనే బయలుదేరి సమతా నగర్ కు వచ్చింది. స్రవంతి ఇంటికి చేరుకునే సరికే మహేందర్ సామాన్లన్నింటిని సర్దేసాడు. ఇంటికి వచ్చిన స్రవంతి ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. ఈ గొడవలోనే మహేందర్ స్రవంతి తలపైనా, ముఖంపైన గట్టిగా కొట్టాడు. స్రవంతి అక్కడికక్కడే మృతి చెందింది. దీనితో ఆమె మృతదేహాన్ని చున్నీతో కప్పి, మంచం కింద పెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అయితే స్రవంత్ అన్న ప్రశాంత్ కు స్రవంతి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం, ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అతనికి మరింత అనుమానం రావడంతో ఇంటి తలపులు బద్దలు కొట్టి చూడగా.. లోపల స్రవంతి మృతదేహం కనిపించింది. దీనితో ప్రశాంత్ పోలీసులకు సమాచారం అందించాడు.
Read More:
రాత్రి సమయంలో ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!
జీవితంలో సక్సెస్ అయ్యిన వారికి ఈ బాడ్ హ్యాబిట్స్ అస్సలు ఉండవు.. అవేంటంటే?