Advertisement
Mangalavaram Movie Review: ఆర్ ఎక్స్ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ దర్శకుడు అయిపోయిన అజయ్ భూపతి తన రెండవ సినిమాగా “మహా సముద్రం” లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకున్నారు. స్కేల్ పరంగా ఇది పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ.. ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఇప్పుడు “మంగళవారం” అనే కొత్త కాన్సెప్ట్ తో అజయ్ భూపతి ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పాన్-సౌత్ ఇండియన్ మూవీ, నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషల్లో విడుదల అయింది.
Advertisement
ఇందులో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. ‘కాంతారావు’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ అయిన ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతి గునుపాటి మరియు సురేష్ వర్మ ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు అజయ్ భూపతి కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Mangalavaram Movie Cast & Crew కాస్ట్ అండ్ క్రూ :
నటి: పాయల్ రాజ్‌పుత్
దర్శకుడు: అజయ్ భూపతి
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఎమ్
విడుదల తేదీ : 17 నవంబర్ 2023
భాష: తెలుగు
రన్ టైమ్: 2గం 20 నిమిషాలు
జానర్: యాక్షన్, డ్రామా
ఈ సినిమాకు సెన్సార్ వారు చాలానే కట్స్ చెప్పారట. ముఖ్యంగా ఆ సీన్స్ కట్ చేయకుంటే యు/ఎ ఇవ్వలేమని చెప్పారట. యు/ఎ రాకపోయినా పర్లేదని, కట్స్ మాత్రం వద్దని సినిమా యూనిట్ రిక్వెస్ట్ చేశారట. దీనితో సెన్సార్ వారు ఈ సినిమాకు క్లీన్ A సర్టిఫికెట్ ఇచ్చారట. ఈ సినిమాకు పాయల్ రాజ్ పుత్ నటనతో పాటు అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ పాయింట్ అవుతాయట. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందని, బి..సి.. సెంటర్స్ లలో ఈ సినిమా బాగా ఆడుతుందని అంటున్నారు.
Advertisement
Mangalavaram Story :
గోదావరి జిల్లాలోని మా లక్ష్మీపురం గ్రామంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటలు ప్రతీ మంగళవారం మరణిస్తుంటారు. దీంతో ఆ ఊరి ప్రజలను భయబ్రాంతులక గురి చేస్తుంది. అమ్మవారి జాతర జరిపించకపోవడం వల్లనే ఈ అరిష్టానికి కారణం అని గ్రామస్తులు భావిస్తారు. అలాంటి సమయంలోనే ఓ మహిళ దెయ్యమే అందరినీ చంపేస్తుందనే మూఢనమ్మకంతో ఉంటారు. ఈ తరుణంలోనే ఆ గ్రామానికి ఎస్ఐ(నందిత శ్వేత) వచ్చి ఆ మరణాల వెనుక ఏదో మర్మం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపడుతుంది. ఆ గ్రామంలో శైలు (పాయల్ రాజ్ పుత్)ను జమీందార్ ఆదేశాల మేరకు గ్రామస్తులు శిక్షించాలనుకుంటారు. శైలుకు ఎవ్వరూ అండగా నిలుస్తారు? చివరికి ఆ గ్రామంలో జరిగేవి హ*త్యలా..? ఆత్మహ**త్యలా..? మంగళవారం రోజే మరణాలు ఎందుకు సంభవించాయి ? ఈ మరణాలకు ఎవ్వరూ అడ్డుకట్ట వేశారు ? అనే ప్రశ్నలకు సమాధానమే మంగళవారం సినిమా కథ. ఈ కథకు సమాధానం కావాలంటే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించాల్సిందే.
Mangalavaram Review:
దర్శకుడు అజయ్ భూపతి శైలు అనే అమ్మాయి బాల్యానికి సంబంధించిన సంఘటనలతో కథను భావోద్వేగంతో ప్రారంభించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మా లక్ష్మీపురం గ్రామంలో ఉండే కొన్ని క్యారెక్టర్లను ప్రధానంగా చేసుకొని హీరో, హీరోయిన్లు లేకుండానే ఫస్టాప్ వరకు కథను పరుగులు పెట్టించడం సక్సెస్ ప్రధాన కారణమనే చెప్పాలి. ఫస్టాప్ లో మరణాలు, వాటి చుట్టూ సాగిన డ్రామాను రక్తి కట్టించారు దర్శకుడు. శైలు పాత్రకు సంబంధించిన చిన్న ట్విస్ట్ తో ఫస్టాప్ ను ముగించడంతో పాటు సెకండాఫ్ పై అంచనాలను పెంచేశారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అసలు కథను మొదలు పెట్టి ప్రతీ ఎపిసోడ్ తో ట్విస్ట్ ఇస్తూ ప్రతీ సీన్ ను ఎమోషనల్ గా మార్చాడు.
ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రతీ ట్విస్ట్ ను విప్పిన విధానంతో సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా పరుగులు పెట్టేవిధంగా చేశాడనే చెప్పవచ్చు. ఇందులో పాయల్ రాజ్ పుత్ ఎవ్వరూ ధైర్యం చేయని పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని ఫెర్పార్మ్ చేసిన విధానం సూపర్ అనిపించేవిధంగా చేసింది. రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి, దయానంద్ రెడ్డి, నందిత శ్వేత, దివ్యపిళ్లై తదితరులు తమ పాత్రల మేరకు వారు రాణించారు. ముఖ్యంగా అజయ్ ఘోష్, లక్ష్మణ్ కాంబోలో వచ్చే కొన్ని సీన్లు మంచి కామెడీని పండించాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ హైలెట్. అదేవిధంగా తల్లూరి కృష్ణ ఆర్ట్ విభాగం, గుల్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ తో సినిమాను అద్భుతంగా మార్చారు. ముఖ్యంగా కొత్త అనుభూతి.. థ్రిల్లింగ్ అనిపించే ట్విస్ట్ లు ఈ సినిమాకి హైలెట్. థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.