Advertisement
“మా ఊరి పొలిమేర” సినిమా చిన్న సినిమాగానే రిలీజ్ అయ్యింది. కానీ దీనికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగా రావడంతో దీనికి సీక్వెల్ గా పొలిమేర 2 ని కూడా తీశారు. కొన్ని రోజుల క్రితమే రిలీజ్ అయినా ఈ సినిమాకు బాగానే టాక్ వచ్చింది. మొదటి పార్ట్ లో మిస్టరీకి చేతబడి అంశాన్ని కలిపి ఈ పార్ట్ 2 ని మరింత రసవత్తరంగా తీర్చిదిద్దారు.
Advertisement
ఈ సినిమాలో జాస్తిపల్లి ఊరిలో ఏకపాదమూర్తి గుడికి, కేరళలోని అనంత పద్మ నాభ స్వామి గుడికి లింక్ ఉన్నట్లు, అక్కడ కూడా నిధులు ఉన్నట్లు స్టోరీలో చూపించారు. అయితే.. వీటిని సొంతం చేసుకోవడం కోసమే కొమిరి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడని స్టోరీ లో చూపించాడు. ఈ అంశం చాలా ఆసక్తికరంగా చూపించారు. అయితే.. ఈ గుడి నిజంగానే ఉందా? నిజంగానే అందులో నిధులు ఉన్నాయా అంటూ నెటిజన్స్ కి చాలా డౌట్లే వచ్చాయి.
Advertisement
నిజంగానే ఈ టెంపుల్ ఉంది. అయితే అది జాస్తిపల్లిలో కాదు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఈ గుడి ఉంది. 16వ శతాబ్దం కాలం నుంచి ఈ గుడి ఉందట. ఈ టెంపుల్ ని మాధవరాయ స్వామి ఆలయం అని పిలుస్తారట. ఇండియన్ గవర్నమెంట్ దీనికి జాతీయ ప్రాముఖ్యతని కూడా ఇచ్చింది. మర్యాద రామన్న, సైరా, ఇండియన్ 2 , రాధేశ్యాం సినిమాలు ఇక్కడ షూటింగ్ కూడా చేసుకున్నాయట. ఈ టెంపుల్ కి సంబంధించిన తోలి ప్రస్తావన 16వ శతాబ్దం శాసనాలలో ఉంది. అప్పటి విజయనగర కాలం నాటి రాజులు ఈ గుడిని నిర్మించారట. అప్పట్లో ఈ ఆలయం ఓ వెలుగు వెలిగింది. కానీ మహమ్మదీయుల దాడికి ఈ గుడి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఈ గుడిలో దేవుని విగ్రహం కూడా లేదు. ఊరికి దూరంగా ఉండడంతో ఈ గుడికి తాళాలు వేసి ఉంచుతారు. టూరిస్టులు వచ్చే సమయాల్లోనే తీసి ఉంచుతారు. అక్కడి వారు ఈ గుడిలో ఎలాంటి నిధులు లేవని, మహమ్మదీయుల దాడుల సమయంలోనే దోపిడీకి గురి అయ్యాయని చెబుతున్నారు.
Read More: