Advertisement
ఏదైనా ఈవెంట్ కి యాంకర్ గా సుమ వస్తోందంటే చాలు.. ఈవెంట్ ఆర్గనైజర్లు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండిపోతారు. ఎందుకంటే ఆమె యాంకరింగ్ లో తప్పులు దొర్లడం అనేది చాలా అరుదు. ఎక్కడైనా పొరపాట్లు జరిగినా… ఆమె వాటిని ఎలాగైనా కవర్ చేయగల లోకజ్ఞానాన్ని ప్రదర్శించేస్తుంది. అయితే.. సుమ తన కెరీర్ లో మొట్ట మొదటి సారి ఒక ఇంటర్వ్యూ లో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఇంటర్వ్యూ తరువాత ఆమె విపరీతంగా ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ లో ఏమైంది? సుమ చేసిన పొరపాటు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
నిజానికి సుమక్క ఈవెంట్లే కాదు.. ఇంటర్వ్యూలు కూడా చాలా ఫన్ గా ఉంటాయి. పూర్తిగా స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవుతూ సుమ ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే.. రీసెంట్ గా సుమక్క కన్నడ టీం మెంబెర్స్ తో ఓ ఇంటర్వ్యూ చేసింది. రక్షిత్ శెట్టి నిర్మాతగా, హీరోగా ఉన్న ఈ సినిమా హీరోయిన్స్ కూడా కన్నడ వాళ్లే. అయితే వీరితో ఇంటర్వ్యూ చేసే సమయంలో చాలా తప్పులే దొర్లాయి. చాలా తక్కువ టైం లో సీక్వెల్ రావడం ఇదే మొదటి సారి. రెండు పార్టులు ఒకే సారి రాసుకున్నారా? అని రక్షిత్ శెట్టిని అడిగితే.. నేను రైటర్ ని కాదు హేమంత్ ఈ సినిమాకు రైటర్ అంటూ రక్షిత్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Advertisement
అవునా అని సుమ సారీ చెప్పింది. రెండు పార్ట్స్ తీయడానికి మీ నిర్మాత ఒప్పుకున్నారా? అని మరో ప్రశ్న వేసింది. ఈ సినిమా నిర్మాతని నేనే అని రక్షిత్ మళ్ళీ చెప్పుకోవాల్సి వచ్చింది. సుమ మళ్ళీ సైలెంట్ అయిపొయింది. మీరు రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్.. సింగర్ కూడా కదా? అని డౌట్ గా అడుగుతూ ఉండగానే.. కన్నడ హీరోయిన్స్ ఇద్దరూ సింగర్ కాదు లిరిసిస్ట్ అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో సుమ తెల్ల మొహం వేయాల్సి వచ్చింది. మినిమం ప్రిపేర్ అవకుండా ఇంటర్వ్యూ ఎలా చేసావ్ అంటూ నెటిజన్స్ సుమక్కని ట్రోల్ చేసేస్తున్నారు.
Read More:
2003 వరల్డ్ కప్ ఫైనల్ లో ఏమి జరిగింది? ఆ ఒక్క తప్పు ఇప్పుడు అస్సలు చెయ్యకూడదు!
శ్రీలంకతో సహా ICC సస్పెండ్ చేసిన ఎనిమిది దేశాలు ఇవే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!