Advertisement
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి గురించి మాజీ మంత్రి కొడాలి నాని ఊహించని వ్యాఖ్యలు చేసారు. అలాంటి కూతురు ఎవ్వరికీ ఉండకూడదు అని అన్నారు. తన తండ్రి మరణానికి కారణమైన వ్యక్తి పార్టీకే పురంధేశ్వరి ఇప్పుడు బిటీంగా వ్యవహరిస్తోంది అంటూ కొడాలి నాని విమర్శలు వ్యక్తం చేసారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిలో పురంధేశ్వరికి కూడా వాటాలు అందాయని.. అప్పుడేమో సైలెంట్ గా ఉండి.. ఇప్పుడేమో జగన్ మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Advertisement
వైసీపీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడానికి వీలు లేదని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని.. ఖబడ్ధార్ అంటూ సీరియస్ అయ్యారు. బెయిల్ లభించడం కోసమే.. చంద్రబాబు నాయుడు గుండెకి బొక్క పడింది అంటూ నాటకాలు ఆడారు అని ఎద్దేవా చేసారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇసుక ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి లభించిందన్నారు.
Advertisement
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ లాభాలు వచ్చాయని.. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి లాభం అయినా వచ్చిందా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. . 2014, 2019 ఎన్నికల సమయంలోనే రాష్ట్ర ప్రజలు ఛీకొట్టారని.. అయినప్పటికీ పురంధేశ్వరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. బెయిల్ కోసమే చంద్రబాబు నాయుడు గుండెల్లో బొక్క అంటూ డ్రామా ఆడుతున్నారని, ఆయన జీవితమంతా అవినీతి బొక్కలు, మచ్చలతోనే నిండిపోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేదని, పేద వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
Read More:
ఈ ఆటగాళ్లు తమ చివరి వరల్డ్ కప్ ఆడేశారా? నెక్స్ట్ వరల్డ్ కప్ కి వీరు ఉండట్లేదా?