Advertisement
పాములంటే అందరికి భయమే. ఎందుకంటే అవి విష జంతువులూ కాబట్టి. అవి కాటు వేస్తె మన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి. అయితే.. అన్ని పాములు ప్రమాదకరమైనవి కాదు. కేవలం కొన్నిటి కోరల్లో మాత్రమే విషం ఉంటుంది. అవి కాటు వేసినప్పుడు వాటి కోరల్లో ఉండే విషం మన శరీరంలోని రక్తంలో ప్రవహించి పరిస్థితిని ప్రమాదకరంగా మారుస్తుంది. అయితే.. పాములు అన్ని సార్లు కాటు వేయడానికి చూడవు. కేవలం అవి ప్రమాదం ఎదురైంది అని భావించినప్పుడు మాత్రమే, అత్యవసర పరిస్థితులలోనే తమ విషాన్ని ఉపయోగించుకుంటాయి.
Advertisement
అయితే.. చాలా వరకు పాములు ఎక్కువగా వెలుతురులో తిరగడానికి కూడా ఇష్టపడవు. ఇప్పుడు సిటీస్ లో పాములు ఉండేవి తక్కువే అయినా.. మారుమూల పల్లె ప్రాంతాల్లో పాములు ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి ఇళ్లల్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు వెలుగులోకి రావడానికి ఇష్టపడవు. వాటికి ఏదైనా ఆహరం ఉందని అనిపిస్తే ఇళ్లల్లో దూరుతూ ఉంటాయి. అది కూడా చీకట్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పాము కాటేసిన సందర్భాలు కూడా చీకట్లలోనే జరుగుతూ ఉంటాయి.
Advertisement
అయితే.. పాము కాటు వేసే ముందు కచ్చితంగా సంకేతాలు ఇస్తుందట. కోరలను బయటకు లోపలకు చాస్తూ స్.. స్.. అంటూ శబ్దాలు చేస్తాయట. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ ఉంటాయట. పాముల ప్రవర్తనని గమనించగలిగితే.. పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు. కట్లపాము రాత్రి వేళల్లో ఎక్కువగా చురుగ్గా ఉంటాయట. రాత్రి నుంచి ఉదయం దాకా అది ఆహరం కోసం వెతుకుతూ ఉంటుందట. అందుకే ఆ సమయంలో కాటు వేసే అవకాశం ఉంటుందట. కానీ, అది కాటు వేసే సమయంలో మనకి తెలియదు. ఎలాంటి శబ్దాలు చేయకుండానే కాటు వేస్తుంది. కానీ చాలా వరకు పాములు శబ్దం చేస్తూ ఉంటాయి. పాము కాటుకి గురి అయితే.. వెంటనే ప్రధమ చికిత్స చేయాలి. పాము కాటుకి గురి అయిన 15-20 నిముషాల నుంచి ప్రమాదమే. ఎందుకంటే ఆ విషం శరీరం అంతా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే పాముకాటు వేసిన చోటు నుంచి కొంత పైకి జరిగి కట్టు కట్టాలి. విషం శరీరం అంత వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఇలా చేయాలి. ఆ వ్యక్తిని ఎక్కువగా కదల్చకపోవడమే మంచిది. కదల్చడం వలన విషం త్వరగా వ్యాపిస్తుంది.
Read More:
హాయ్ నాన్న సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్.. వారు ఏమన్నారంటే?
ఇండియా ఓడిపోవడంపై మాజీ పాకిస్తానీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..!