Advertisement
ఎయిర్ పోర్ట్ లో మనం ఫ్లైట్ ఎక్కడానికి ముందే లగేజ్ చెకిన్ చేస్తాము. ఆ తరువాత మన జర్నీ పూర్తి అయ్యాక లగేజ్ కలెక్ట్ చేసుకుంటాము. ఈ క్రమంలో కొన్ని సార్లు లగేజ్ పాడైపోవచ్చు. లేదా ఒక్కోసారి మన లగేజ్ మిస్ అవ్వచ్చు కూడా. అయితే.. అలాంటి పరిస్థితిలో మనం ఏమి చెయ్యాలి? నిజంగా ఇలాంటి సిట్యుయేషన్ వస్తే.. అది మన ప్రయాణాలకు పెద్ద సవాల్. అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు. ఈ టిప్స్ తో మీ లగేజ్ ని పొందవచ్చు. లేదా దానికి పరిహారాన్ని అయినా పొందవచ్చు.
Advertisement
ముందు కన్వేయర్ బెల్ట్ పై వచ్చే లగేజీలను గమనించాలి. వాటిలో మీ లగేజ్ లేకపోతే అది పోయింది అని చాలా మంది అనుకుంటారు. కానీ, కనీసం అరగంట పాటు వెయిట్ చేయాలి. ఆ తరువాత కూడా మీ లగేజ్ రాకుంటే.. అప్పుడు పోయిందని నిర్ధారించుకోవాలి. ఒకవేళ మీ లగేజ్ దొరికినా.. అది పాడైపోయి ఉంటె. వెంటనే అధికారులను సంప్రదించి ఇన్ఫోర్మ్ చేయాలి. అయితే వీలైనంత త్వరగా స్పందించాలి.
Advertisement
బ్యాగేజి సేవల విభాగంలో ప్రాపర్టీ లాస్ కి సంబంధించిన ఫారం ను ఫిలప్ చేసి సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ మీ బాగ్ దొరక్కపోతే ఆ ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు, లగేజ్ కి సంబంధించిన వివరాలను ఇవ్వాలి. ఇవి సిబ్బందికి మీ బాగ్ వెతకడంలో హెల్ప్ అవుతాయి. వారు ఫిర్యాదు తీసుకున్నాక మీకు ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తారు. ఆన్ లైన్ లోనే మీ బాగ్ ఎక్కడ ఉందొ ట్రాక్ చేసి తెలుసుకుంటూ ఉండచ్చు. ఒకవేళ 24 గంటలలో మీ బాగ్ ని పట్టుకోలేకపోతే.. దానికి ఎయిర్ లైన్స్ నే బాధ్యత వహిస్తుంది. మీ లగేజ్ కి తగ్గ పరిహారాన్ని అందిస్తుంది. అయితే ఇది క్లెయిమ్ చేసుకోవడానికి బాగ్ పోయినప్పటి నుంచి ఏడు రోజుల లోపు మీరు ఎయిర్ లైన్స్ కి లేఖ పంపాల్సి ఉంటుంది. పరిహారం కోసం ప్రొఫెషనల్ గా చర్చలు కూడా జరపాల్సి ఉంటుంది.
Read More:
పాములు కాటు వేసే ముందు హెచ్చరిస్తాయా? అలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలుసా?
అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా?
హాయ్ నాన్న సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్.. వారు ఏమన్నారంటే?