Advertisement
ప్రతి మనిషికి అంతో ఇంతో స్వార్ధం ఉండడం అనేది సహజం. కానీ పక్కన వారి గురించిన ఆలోచన లేకుండా కేవలం స్వార్థంతోనే ఉండే వ్యక్ట్లను భరించడం కష్టం. ఒకవేళ దురదృష్టవశాత్తు అటువంటి వ్యక్తి మీ భార్య అయితే.. ఆ భర్త పరిస్థితి వర్ణనాతీతం. భార్యాభర్తల మధ్య స్వార్ధం అన్నది ఉండకూడదు. అయితే.. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు భర్తలు కచ్చితంగా ఈ ఆరు పనులు చేయాలట. అదేంటో ఇప్పుడు చూసేయండి.
Advertisement
ఏ బంధానికైనా ఓపెన్ కమ్యూనికేషన్ చాలా అవసరం. మీ భార్యతో కూడా కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిందలు వేయడం కంటే.. మీ భావాలను, ఆందోళనలను ముందుగానే వ్యక్తపరచాలి. వారి ప్రవర్తన మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియపరచాలి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడే ముందు మీ సొంత ప్రవర్తన గురించి కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్న తరువాత మీ భాగస్వామితో మాట్లాడాలి.
Advertisement
మీ మధ్య సరిహద్దుల్ని కూడా సెట్ చేసుకోవాలి. మీ మధ్య ఉన్న హద్దుల గురించి కూడా స్పష్టంగా మీ భాగస్వామికి ముందుగానే వివరించాలి. ఇలా చేయడం వలన మీ భాగస్వామిని స్వార్ధంగా ప్రవర్తించకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ మీ మధ్య వస్తున్నా సమస్యలను పరిష్కరించుకోలేక పోతుంటే వృత్తిపరమైన సలహా తీసుకోవచ్చు. ఎవరైనా థెరపిస్ట్ ను కలిసి మీ సమస్యలు, పరిష్కారాల గురించి చర్చించాలి. అలాగే మీ మధ్య సానుభూతి పెంపొందేలా మీ ప్రవర్తన, ఆలోచన ఉండాలి. మీ దృష్టి కోణం నుంచి కూడా ఆలోచించి.. మీ భావోద్వేగాలను అర్ధం చేసుకోవాలి. మీ భార్య స్వార్ధ పరురాలు అయినప్పుడు.. మీరు మీ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి. మీ శ్రేయస్సు గురించి కూడా ఆలోచించుకోవాలి. మీ సొంత ఆసక్తులను కొనసాగించండి.
Read More:
పాములు కాటు వేసే ముందు హెచ్చరిస్తాయా? అలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలుసా?
అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా?
హాయ్ నాన్న సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్.. వారు ఏమన్నారంటే?